Regi Pandu Pachadi: సంక్రాంతి స్పెషల్ రేగి పండ్ల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుని మరీ తినేస్తారు!

Best Web Hosting Provider In India 2024

Regi Pandu Pachadi: సంక్రాంతి స్పెషల్ రేగి పండ్ల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుని మరీ తినేస్తారు!

Ramya Sri Marka HT Telugu
Jan 11, 2025 05:00 PM IST

Regi Pandu Pachadi: ఎప్పుడో చిన్నప్పుడు తిన్న రేగి పండు పచ్చడి గుర్తుందా..? రేగు పండ్లతో చేసే రోటి పచ్చడి టేస్టే వేరు. అమ్మమ్మనో, నానమ్మనో చేసి ఇస్తే కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే పచ్చడిని ఉఫ్పు ఉఫ్ఫూ అని ఊదుకుంటూనే ఎంజాయ్ చేసేవాళ్లం. అలాంటి పచ్చడిని మరోసారి ట్రై చేద్దామా..! ఎలా చేయాలో ఇక్కడుంది.

సంక్రాంతి స్పెషల్ రేగి పండ్ల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుని మరీ తినేస్తారు!
సంక్రాంతి స్పెషల్ రేగి పండ్ల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుని మరీ తినేస్తారు!

ఏ సీజన్‌లో దొరికే పండ్లు అప్పుడే తినకపోతే ఎంజాయ్ చేయలేం. మరి ఈ సంక్రాంతి టైంకి కేవలం పిండివంటలతోనే కాకుండా రేగు పండ్లను తినాలనుకుంటున్నారా.. మీ పిల్లలకు ఎలాగూ భోగి పండ్లు పోసేందుకు రేగు పండ్లు తీసుకొస్తారు కదా. వాటిల్లో కొన్నింటిని ఇలా పచ్చడి కోసం పక్కకుపెట్టండి. రుచికరమైన, నోరూరించే రోటి పచ్చడి చేసేసుకోవచ్చు. మీరు రేగు పండ్ల (రేక్కాయల) పచ్చడి చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి.

yearly horoscope entry point

కావాల్సిన పదార్థాలు:

  • నూనె – రెండు టేబుల్ స్పూన్లు
  • ఆవాలు – రెండు టీ స్పూన్లు
  • మినపప్పు – రెండు టీ స్పూన్లు
  • ఇంగువ – అర టీ స్పూన్
  • జీలకర్ర – ఒక టీ స్పూన్
  • ఎండిమిరప కాయలు – 3 నుంచి 4
  • కరివేపాకు – 20 ఆకులు
  • చింతపండు – ఐదు రెబ్బలు
  • కొత్తిమీర – 100 గ్రాములు
  • కళ్లుప్పు – రుచికి తగినంత
  • రేగు పండ్లు – పావు కిలో

రేగు పండ్లతో పచ్చడి తయారు చేయడం ఎలా?

  • ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లేదా కడాయి తీసుకుని దాంట్లో నూనె వేసుకోవాలి.
  • నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు వేసుకుని వేయించుకోవాలి.
  • తరువాత దీంట్లో మినపపప్పు, ఇంగువ, జీలకర్ర వేసుకుని వేపుకోండి.
  • ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి ఎండినమిరప కాయలు, కరివేపాకు వేయించండి.
  • ఇవి కూడా వేగిన తర్వాత దాంట్లో శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిరకాయలను వేసి వేయించేకోండి.
  • తరువాత దీంట్లోనే చింత పండును, కొత్తిమీరను వేసి చక్కగా కలపాలి. ఇవన్నీ నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రేగు పండ్లు కూడా వేసుకోవాలి.
  • రేగు పండ్లు నూనెలో వేగుతుండగానే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కళ్లుప్పు వేస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.
  • రేగిపండ్లు నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ తీసుకుని పక్కకు పెట్టుకోండి.
  • ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని కచ్చా పచ్చగా అయ్యేలా మిక్సీ పట్టాలి.
  • మీకు వీలు ఓపిక ఉంటే రోటిలో దంచుకుంటూ పచ్చడి అమ్మమ్మలు, నానమ్మలు చేసినట్లుగా మరింత రుచిగా ఉంటుంది.
  • కచ్చా పచ్చాగా దంచిన ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • అంతే కమ్మటి రుచికరమైన రేగి పండు పచ్చడి తయారయినట్టే. దీన్ని అన్నంలోకి, దోసల్లోకి, రొట్టెల్లోకి కూడా కలుపుకుని తినచ్చు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024