Best Web Hosting Provider In India 2024
Game Changer Collection: రెండో రోజు పడిపోయిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్.. 25 శాతం రికవరీ.. హిట్‌కు ఎన్ని కోట్లు రావాలంటే?
Game Changer Worldwide Box Office Collection Day 2: గేమ్ ఛేంజర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బాగానే ఉంటున్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి మొదటి రోజున రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మరి రెండు రోజుల్లో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ వివరాలపై ఇక్కడ లుక్కేద్దాం.
Game Changer 2 Days Worldwide Collection: భారీ అంచనాల నడుమ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10న చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన 2 గంటల 44 నిమిషాల రన్ టైమ్ ఉన్న గేమ్ ఛేంజర్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది.
అతి తక్కువగా
గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో తొలి రోజున రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. వాటిలో తెలుగు నుంచి రూ. 41.24 కోట్లు రాగా హిందీ బెల్ట్‌లో రూ. 7.5 కోట్లు, కర్ణాటకలో పది లక్షలు, తమిళంలో 2.12 కోట్లు, మలయాళంలో 3 లక్షలుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే, ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో నెట్ కలెక్షన్స్ ఉంటే అతి తక్కువగా మలయాళంలో ఉన్నాయి.
నైట్ షోలు పూర్తయ్యేసరికి
ఇక రెండో రోజు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రెండో రోజున ఇండియాలో రూ. 12.33 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. అయితే, నైట్ షోలు పూర్తయ్యేసరికి ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. కానీ, ఎలా చూసుకున్న మొదటి రోజు కంటే రెండో రోజు మాత్రం గేమ్ ఛేంజర్ వసూళ్లు తగ్గే సూచలను కనిపిస్తున్నాయి.
2 రోజుల కలెక్షన్స్
ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 63.33 కోట్ల నికర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. పూర్తి కలెక్షన్స్ తెలిసాకా ఈ లెక్కలు మారే అవకాశం ఉంది.
25 శాతం రికవరీ
ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా తొలి రోజు గేమ్ ఛేంజర్ రూ. 56.42 కోట్ల షేర్, రూ. 92.25 కోట్ల గ్రాస్ రాబట్టిందని పలు ట్రేడ్ వెబ్ సైట్స్ తెలిపాయి. అలాగే, రూ. 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు ఫిక్స్ అయిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 223 కోట్ల కలెక్షన్స్‌లో తొలి రోజున 25 శాతం వరకు రికవరీ అయినట్లు పేర్కొన్నాయి.
అలా అయితేనే హిట్
అయితే, మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సోషల్ మీడియా వేదిగా ప్రకటించింది. దీంతో గేమ్ ఛేంజర్ మొదటి రోజు కలెక్షన్స్‌పై కాస్తా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే, గేమ్ ఛేంజర్ సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ. 166.58 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అప్పుడే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా హిట్ అవుతుంది.
సంబంధిత కథనం