Tirumala Leopard : తిరుమలలో చిరుత కలకలం, టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు

Best Web Hosting Provider In India 2024

Tirumala Leopard : తిరుమలలో చిరుత కలకలం, టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు

Bandaru Satyaprasad HT Telugu Jan 11, 2025 08:52 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Jan 11, 2025 08:52 PM IST

Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి వేదిక్ వర్సిటీ వద్ద దాటుతున్న చిరుతను చూసి భయాందోళనకు గురై బైక్ పై వెళ్తోన్న టీటీడీ ఉద్యోగి డివైడ్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు.

 తిరుమలలో చిరుత కలకలం, టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు
తిరుమలలో చిరుత కలకలం, టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తోన్న టీటీడీ ఉద్యోగికి రోడ్డు పక్కన చిరుత కనిపించింది. దీంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని హుటాహుటిన తిరుపతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు చిరుత సంచారంపై భక్తులను అలర్ట్ చేశారు.

yearly horoscope entry point

వేదిక్‌ యూనివర్సిటీ వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను బైక్ వెళ్తోన్న టీటీడీ ఉద్యోగి విజయ్‌కుమార్‌ చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టగా…అతడికి తీవ్రగాయాలయ్యాయి. విజయ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ మార్గంలో వెళ్లే భక్తులు చిరుత సంచారంతో భయపడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ, టీటీడీ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేశారు. భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. చిరుత సంచారంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చడంతో పాటు బోన్ ఏర్పాటుపై చర్చిస్తున్నారు.

తిరుపతి తొక్కిసలాట బాధితులకు ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణీ

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించించింది. ఈ మేరకు జనవరి 12 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్‌నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా సందర్శించి ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.

వైజాగ్, నర్సీపట్నంను సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎం ఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు, కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంత రాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు. అదే విధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరిస్తాయి.

అంతే కాకుండా ఈ కమిటీ సభ్యులు తీవ్రంగా గాయపడిన భక్తులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను, పాక్షికంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TirumalaTirupatiAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024