Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu: శ్రుతికి భయపడిన ప్రభావతి- కొత్త కోడలు చేష్టలకు విసిగిపోయిన సత్యం ఫ్యామిలీ- అవమానించిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial January 13th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 13 ఎపిసోడ్లో రవి, శ్రుతి సత్యం ఇంటికి వస్తారు. కానీ, శ్రుతి చేష్టలకు సత్యం కుటుంబం అంతా విసిగిపోతుంది. పైనుంచి కిందకు వచ్చిన బాలు రచ్చ రచ్చే చేస్తాడు. సురేంద్రను కీసుపిట్ట అంటూ అవమానిస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కుడి కాలు లోపల పెట్టి శ్రుతిని రమ్మంటుంది ప్రభావతి. రెండు కాళ్లు అసరం. కుడి కాలే ఎందుకు అంత ఇంపార్టెంట్ అని శ్రుతి అంటుంది. తినడానికి రెండు చేతులు ఉన్న కుడి చేయితోనే ఎందుకు తింటారు. లాజిక్‌లు అడగకుండా రా శ్రుతి అని రవి అంటాడు. శోభనను లోపలకి రమ్మని పిలుస్తుంది ప్రభావతి.
లోపలికి రాకపోవడం ఆయన ఇష్టం
వాళ్ల ఆయన కూడా వచ్చారని మీనా చెబుతుంది. ఆయన ఇక్కడిదాకా వచ్చారు వెళ్లి లోపలికి పిలవండి అని ప్రభావతి అంటుంది. లోపలికి రావడం రాకపోవడం ఆయన ఇష్టం. మీరు అయితే వెళ్లి పిలవండి మావయ్య అని మీనా అంటుంది. దాంతో సురేంద్రను పిలవడానికి సత్యం వెళ్తాడు. లోపలికి.. అని సత్యం అంటే రాను అని సురేంద్ర అంటాడు.
నేను వదిలేశాను. నా కొడుకు, నీ కూతురు తొందరపడి తప్పు చేశారు. నిజం తెలియక మీరు తొందరపడ్డారు. ఏం తెలియని నేను అవమానాలు పడ్డాను. ఎంతైనా మీరు నా కోడలి తండ్రి. పిలవడం నా మర్యాద. రావడం రాకపోవడం మీ ఇష్టం అని సత్యం అంటాడు. నా కూతురు ఇప్పుడు నీ ఇంటి కోడలు. గత్యంతరం లేక నీకు అప్పజెప్పడానికి వచ్చాను. అంతే తప్పా మనమధ్య ఎలాంటి బంధుత్వాలు లేవు అని సురేంద్ర అంటాడు.
సరే మీ ఇష్టం అని వెళ్లిన సత్యం శోభనకు మీవారు రానన్నారని చెబుతాడు. దాంతో శోభనను లోపలికి తీసుకెళ్తుంది ప్రభావతి. తర్వాత సత్యం కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాడు రవి. శ్రుతి నువ్ కూడా కాళ్లమీద పడమ్మా అని ప్రభావతి అంటే.. నేను మా నాన్న కాళ్ల మీదే పడలేదు అని శ్రుతి అంటుంది. సారీ చెప్పడానికి కాదు. ఆశీర్వాదం తీసుకోడానికి అని మీనా అంటుంది. దాంతో సత్యం కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది శ్రుతి.
బాలు రచ్చ
ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని ప్రభావతి అంటుంటే.. పై నుంచి డోర్ కొడతాడు బాలు. ఎవరో తలుపు కొడుతున్నారని శ్రుతి అంటే.. ప్రభావతి కవర్ చేస్తుంది. మీనా వెళ్తుంటే.. అడ్డుకుని కాఫీ ఇవ్వమంటుంది ప్రభావతి. మనోజ్, రోహిణిని శ్రుతికి పరిచయం చేస్తాడు రవి. తర్వాత పైకి వెళ్లిన మీనా డోర్ తీస్తుంది. గడియ పెట్టింది ఎవరు అని బాలు అడిగితే మీనా తెలియదు అంటుంది. మాటలు వినిపిస్తున్నాయి. ఎవరొచ్చారు పదా అని బాలు కిందకు వస్తాడు.
ఏంట్రా నువ్వొచ్చావ్ అని బాలు అంటే.. ఇప్పుడేంటీ మళ్లీ కొడతారా అని శ్రుతి అంటుంది. ఇందుకా నువ్ తల్లిగా మారింది. వీళ్లొస్తారనేగా బయటకు పంపాలనుకుంది అని బాలు అంటాడు. రేయ్ బయటకు నడవరా. ఏ మొహం పెట్టుకుని వచ్చావురా. హో మీరు కలిసిపోయారా. అలాంటప్పుడు మా నాన్న మీద కేసు ఎందుకు పెట్టారు. వీళ్ల నాన్న ఎక్కడ అని శోభనను అని బాలు అంటాడు. బయటే ఉన్నారు అని ప్రభావతి అంటుంది.
హో మొహం చెల్లక బయటే ఉన్నారా అని బాలు అంటాడు. బాలు.. సంస్కారం మర్చిపోయి మాట్లాడకు. నేను చెప్పినట్లుగానే వాళ్లు ఇంటికి వచ్చి కూతురుని పంపించారు. వాళ్ల మాట వాళ్లు నిలబెట్టుకున్నారు. నేను కూడా నిలబెట్టుకోవాలి కదా. తొందరపడి మాట జారకు అని సత్యం అంటాడు. నేను వెళ్తాను శ్రుతి. చూడండి. వీళ్లు అందరిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. మాకు కోపం ఉంది. కానీ, మా కూతురు కాబట్టి అదంతా మర్చిపోక తప్పలేదు. మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో వదిలి వెళ్లిపోతున్నాను అని శోభన అంటుంది.
కీసుపిట్టాయన ఎక్కడ
నా కోడలిని కూతురులా చూసుకుంటాను అని ప్రభావతి అంటే.. బాలు ఏంటీ నువ్వా. పచ్చి అబద్ధాలు చెబుతావేంటీ అని కౌంటర్స్ వేస్తాడు. బాలును ఆగమన్నా మీనా మేము తోడికోడళ్లమైనా అక్కా చెల్లెల్లుగానే కలిసి ఉంటాం అని మీనా అంటుంది. నువ్ వాళ్లతో కలిసిపోయావా. ఆ కీస్ పిట్టాయన ఎక్కడ అని బాలు అంటే.. మా డాడ్ కూడా వచ్చారు అని శ్రుతి అంటుంది. అవునా, ఏ గదిలో దాచారు. ఇంట్లోకి ఎందుకు రాలేదు అని బాలు కౌంటర్స్ వేస్తాడు.
నేను పిలిచినా రాలేదు అని సత్యం అంటాడు. ఆయనకే అంతుంటే మనకెంత ఉండాలి. కావాలంటే వీళ్లను వాళ్లింట్లోనే పెట్టుకోమ్మను అని బాలు అంటాడు. ఆయన కోపం కూడా పోతుంది అని మీనా చెబుతుంది. అయినా బాలు రచ్చ చేస్తూనే ఉంటాడు. దాంతో బాలును ఆపుతాడు సత్యం. నువ్ పెద్దింట్లో పుట్టావ్. కానీ, ఇది మధ్యతరగతి ఇల్లు. నువ్ అడ్జస్ట్ చేసుకోవాలి అని సత్యం అంటే.. నాకు అర్థమవుతుంది. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చెప్పాడు. అడ్జస్ట్ అవుతానని శ్రుతి అంటుంది.
సంతోషం. శ్రుతి మా ఇంటి సభ్యురాలిగా చూస్తాం అని సత్యం అంటాడు. శోభనను భోజనం చేసి వెళ్లమని ప్రభావతి అంటుంది. అంతసేపు ఆ కీసుపిట్ట ఆయన బెగ్గర్లా బయటే ఉంటాడా అని బాలు అంటాడు. దాంతో ప్రభావతి ఆపుతుంది. తర్వాత శోభన వెళ్తుంది. మాకు దిక్కు లేక వదిలి వెళ్తున్నాను అనుకుంటున్నారా. మీ ఇల్లు ముక్కలు చేసి మీ నుంచి రవిని దూరం చేసేదాకా నేను వదిలిపెట్టను. వీల్ల ఇల్లు ముక్కలు చేయడానికి ముహుర్తం పెట్టి వచ్చాను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి అని శోభన అంటుంది.
ఇద్దరిని గెంటేస్తాను
దాంతో సురేంద్ర, శోభన వెళ్లిపోతారు. మరోవైపు అందరిని ఇలాగే రానిస్తారా అని బాలు గొడవ చేస్తాడు. దాంతో శ్రుతికి ఫోన్ వస్తుంది. ఇక్కడ చాలా న్యూసెన్స్‌గా ఉందని బయటకు వెళ్తుంది శ్రుతి. చూశారా ఎంత పొగరో. రేయ్ లేచిపోయినోడా. నా ముందు ఆ డబ్బుడమ్మా పొగరు చూపించిందో ముందు నిన్ను తన్ని తర్వాత ఇద్దరిని గెంటెస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు బాలు. ఈ పిల్లతో కాస్తా జాగ్రత్తగా ఉండాలేమో అని ప్రభావతి భయపడుతుంది.
అవును ఆంటీ, ఎవరిని కేర్ చేయట్లేదు అని రోహిణి అంటుంది. నిధానంగా తనే అందరిని అర్థం చేసుకుంటుందిలే. తను చాలా మంచి అమ్మాయి అని మీనా అంటుంది. నీ మొగుడు మంచివాళ్లను ప్రశాంతంగా బతకనిస్తాడా అని ప్రభావతి అంటుంది. మరోవైపు ఫ్రిడ్జ్ నుంచి వోవెన్లోకి వచ్చినట్లుందని పెనం మీంచి నిప్పులో పడినట్లు అయిందని తన ఫ్రెండ్‌తో ఫోన్లో చెబుతుంది శ్రుతి. అప్పుడే రవి వస్తాడు. శ్రుతికి సారీ చెబుతాడు. బాలు కోప్పడినదానికి అని రవి అంటాడు.
దాన్ని చెడా మడా తిట్టడం అంటారు. నీకు అంత దమ్ముంటే మీ అన్నయ్యతోనే సారీ చెప్పించు అని శ్రుతి అంటుంది. అమ్మో రాగానే వాడితో పెట్టుకోలేను అని రవి అంటాడు. నీలాగే పెద్దన్నయ్య డీసెంట్‌గా కనిపిస్తున్నాడు అని శ్రుతి అంటుంది. పెద్దన్నయ్య చదువుకున్నాడు. బాలు చదువుకోలేదు. కానీ మంచివాడు అని రవి అంటాడు. ఆ మంచితనం రుచి చూశానులే. పాపం మీనా ఎలా వేగుతుందో. మీనాకు ఇంకా మంచి భర్త రావాల్సింది అని శ్రుతి అంటుంది.
సీరియల్లో చూశాను
ఇంతలో రోహిణి వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి పంచ్ వేస్తుంది శ్రుతి. కింద పూజా చేయాలని తీసుకెళ్తుంది రోహిణి. పూజ గదికి దగ్గరికి అందరిని పిలుస్తుంది ప్రభావతి. నువ్ దీపం వెలిగించాలని, కొత్తగా వచ్చిన కోడలు దీపం వెలిగించడం ఆనవాయితీ అని ప్రభావతి చెబుతుంది. నేను సీరియల్లో చూశాను. ఇలాంటివి అన్ని స్కూల్లో చెప్పరు అని శ్రుతి అంటుంది. చీర కట్టుకురమ్మని ప్రభావతి అంటే.. ఈ డ్రెస్ బాగాలేదా అని శ్రుతి అంటుంది.
మొదటిసారి వచ్చావ్ కదా చీర కట్టుకుంటే బాగుంటుందని అత్తయ్య ఆశపడుతున్నారు అని రోహిణి చెబుతుంది. సరే మీరు చెప్పింది బాగుంది. కానీ, నా దగ్గర ఒక్కటే ఉంది. అది కూడా ఉతకలేదు అని శ్రుతి అంటుంది. ఏం పర్వాలేదమ్మా. ఇలాగే వెలిగించు అని ప్రభావతి అంటుంది. అయితే, శ్రుతికి అగ్గిపెట్టే వెలిగించడం రాదు. దాంతో మీనాను తడిచింది ఇచ్చావా అని తిడుతుంది ప్రభావతి. లేదు బాగానే ఉందని మీనా అంటుంది.
మ్యాచ్ బాక్స్ ఉపయోగించే అవసరం నాకు రాలేదు. నాకు అలవాటు లేదు. నేను వంట కూడా చేయను కదా. నాకు రాదు కాబట్టి అని శ్రుతి అంటుంది. పెళ్లికి ముందు అమ్మ చేసి పెట్టింది. పెళ్లి తర్వాత రవి చేసి పెడుతున్నాడు. ఇక నాకు వంట నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని శ్రుతి అంటుంది. దాంతో సత్యం ఫ్యామిలీ అంతా విసిగిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్