OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 13, 2025 09:42 PM IST

OTT Comedy Thriller: మోక్ష పటం సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో తిరువీర్ హీరోగా నటించారు. ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందంటే..

OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. మోక్ష పటం సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఫెస్టివల్ స్పెషల్‍గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు. వివరాలివే..

yearly horoscope entry point

స్ట్రీమింగ్ వివరాలు

మోక్ష పటం చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జనవరి 14) స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఈ అర్ధరాత్రి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి పండుగ రోజున ఈ మూవీని స్ట్రీమింగ్‍కు తెస్తోంది.

ట్విస్టులతో మోక్ష పటం చిత్రం ఉంటుందంటూ ఆహా పోస్ట్ చేసింది. “ఈ సస్పెన్స్ ఫుల్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ ట్విస్టులు, టర్నులను మిస్ అవొద్దు” అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీ ట్రైలర్‌ను తీసుకొచ్చింది.

ట్రైలర్ ఇలా..

మోక్ష పటం ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ చిత్రంలో మూడు కథలు ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ మూడింటికి లింక్ ఉంటుంది. ఈ చిత్రంలో దొంగ పాస్ట్ పోర్టుల దందా చేస్తుంటాడు తిరువీర్. తరచూ కంగారు పడుతుంటాడు. ఈ క్రమంలో చిక్కుల్లో పడతాడు. ఓ ప్రేమ జంట తరచూ గొడవలు పడుతూ ఉంటుంది. ఓ మధ్య తరగతి దంపతులు డబ్బులు పోగొట్టుకొని, వెతుకుతూ ఉంటారు. ఇలా మూడు కథలతో ఈ మూవీ ఉంటుంది. అయితే, అన్నింటికీ కనెక్షన్ ఉంటుంది. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. రేపటి నుంచి ఆహాలో ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

మోక్ష పటం చిత్రంలో తిరువీర్, పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, షాంతి రావ్ ప్రధాన పాత్రలు పోషించారు. కామెడీతో క్రైమ్‍ను మిక్స్ చేసి ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. కమ్రాన్ సంగీతం అందించగా.. గోకుల్ భారతి, సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ చేశారు.

గత వారం నీలి మేఘ శ్యామ

ఆహా ఓటీటీలో గత వారం నీలి మేఘ శ్యామ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ లవ్ రొమాంటిక్ కామెడీ మూవీలో విశ్వదేవ్ రాచకొండ, రాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. అర్జున్, కార్తీక్ కథ అందించిన ఈ మూవీకి రవి ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. మనాలీకి ట్రెక్కింగ్ కోసం వెళ్లి హీరోహీరోయిన్ మధ్య ప్రేమ చుట్టూ నీలి మేఘ శ్యామ మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని కార్తీక్ సత్య నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మూవీలో శుభలేఖ సుధాకర్, తనికెళ్ల భరణి, హర్షవర్దన్, సుదర్శన్ కూడా కీలకపాత్రలు పోషించారు. కాగా, హిస్టారికల్ మూవీ రజాకార్ కూడా గత వారం ఆహాలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024