Best Web Hosting Provider In India 2024
Sankranti Wishes: మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలను ఇలా ప్రేమగా తెలుగులో చెప్పండి
Sankranti Wishes: మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలుగులోనే చెప్పండి. ఇక్కడ మేము కొన్ని అందమైన శుభాకాంక్షలు అందించాము.
సంక్రాంతికి బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పకపోతే పండుగ పూర్తికాదు. పండుగ రోజు పూజలు, పిండివంటలు ఎంత ముఖ్యమో… ఆ రోజు బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పడం కూడా అంతే ముఖ్యం. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆరోజే ప్రపంచాన్ని నడిపించే సూర్యదేవుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతిగా మనం పండుగ చేసుకుంటాం. దీనిని దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉత్తరాయణం పేరుతో నిర్వహించుకుంటారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఒక్కో పేరుతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. ఈ రోజున ప్రజలు నువ్వులు, బెల్లంతో చేసిన ఆహారాలను, పెసరపప్పు, బియ్యంతో చేసిన కిచిడీలను దానం చేస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే ఇక్కడ మేము తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు, కోట్స్, మెసేజులు ఇచ్చాము.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో
- మీ ముఖంలో చిరునవ్వును నింపుకోండి,
ప్రతి క్షణం తీపి గురుతులను మిగుల్చుకోండి
మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
2. ఈ సంక్రంతి పర్వదినం సందర్భంగా
మీ జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోవాలి,
ఆనందాల వర్షం మీపై కురవాలి,
మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
3. ఈ సంక్రాంతికి మీ ఆశలను
గాలిపటంలా ఎగురవేయండి,
విజయ శిఖరాన్ని తాకండి
మీ జీవితాన్ని ఆనందపు రంగులతో నింపండి,
హ్యాపీ మకర సంక్రాంతి!
4. ఈ సంక్రాంతి మీ ఆనందాన్ని పెంచాలని,
మీ జీవితంలో బెల్లంలాంటి మాధుర్యాన్ని ఇవ్వాలని
ప్రేమ, ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటూ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
5. సూర్యభగవానుడి వెలుగుతో పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి,
మకర సంక్రాంతి వెలుగు మీ జీవితంలో నిండాలని
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
6. సంబరాల సంక్రాంతి మీ జీవితంలో
సరొకొత్త కాంతులు తేవాలని కోరుకుంటూ
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
7. పతంగుల నాట్యంతో పులకించే సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ పండుగ మీ కలల గాలిపటాలను ఎగురవేయాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
8. ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలి
సంక్రాంతి సుఖసంతోషాలు ఇవ్వాలి
కనుమ కమనీయ అనుభూతులు మిగల్వాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
9. మామిడి తోరణాలతో
పసుపు కుంకుమలతో
ముత్యాల ముగ్గులతో
కళకళలాగే వాకిళ్లతో
మీ ఇల్లు ఆనంద నిలయమై
సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు
10. ఈ మకర సంక్రాంతి మీ ఇంట
కొత్త కాంతులను వెదజల్లాలని కోరుకుంటూ
భోగీ, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
11. భాగ్యాలనిచ్చే భోగీ
సరదానిచ్చే సంక్రాంతి
కమ్మని కనుమ
మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు
12. పసుపు రాసిన గడపలతో
పచ్చ తోరణాలతో
పాడి పంటలతో
ముంగిట ముగ్గులతో
సంక్రంతి మీ మదిలో కాంతిని నింపాలని కోరుకుంటూ
హ్యాపీ మకర సంక్రాంతి
13. సంక్రాంతి మీ జీవితంలో
సరికొత్త కాంతులు తేవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
సంబంధిత కథనం