Makara Jyoti darshanam: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

Best Web Hosting Provider In India 2024


Makara Jyoti darshanam: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

Sudarshan V HT Telugu
Jan 14, 2025 06:50 PM IST

Makara Jyoti darshanam: శబరిమలలో మకర జ్యోతిని మంగళవారం సాయంత్రం లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం కాగానే భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

శబరి మలలో అయ్యప్ప భక్తులు
శబరి మలలో అయ్యప్ప భక్తులు (PTI)

Makara Jyoti darshanam: శబరిమలలో మకర జ్యోతిని మంగళవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం కాగానే భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పొన్నాంబలమేడు కొండపై నుంచి మకర జ్యోతి కనిపించగానే అయ్యప్ప శరణు ఘోషతో శబరి గిరులు మార్మోగాయి. సాధారణంగా సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం జరుగుతుంది.

yearly horoscope entry point

మకర జ్యోతి దర్శనం

శబరిమలలో మకర జ్యోతి దర్శనంతో భక్తులు సంతోషాతిరేకాలు వ్యక్తం చేశారు. శబరిమలలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం మకర జ్యోతి (సాధారణంగా జనవరి 14 న). తిరువాభరణం లేదా భగవంతుని పవిత్ర ఆభరణాలు (పందళం రాజు సమర్పించినవి) మూడు పెట్టెల్లో శబరిమలకు చేరుకుంటాయి ఆభరణాలు అలంకరించిన మరుక్షణమే ఆ జ్యోతి దివ్య దర్శనం జరుగుతుంది. శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. మంగళవారం ఉదయం సమయానికి సుమారు 1.5 లక్షల మంది భక్తులు ఉన్నట్లు సమాచారం.

Whats_app_banner

టాపిక్


Best Web Hosting Provider In India 2024


Source link