Best Web Hosting Provider In India 2024
Kanuma Festival Wishes: కనుమ పండుగ రోజుకు అచ్చ తెలుగులో శుభాకాంక్షలు చెప్పేయండిలా.. మీ కోసం ప్రత్యేకంగా 12 మెసేజ్లు
Kanuma Festival Wishes: సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమ రోజు సందర్భంగా బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా.. కొత్తగా, విభిన్నంగా, అచ్చ తెలుగులో తెలియజేయాలని ప్రయత్నిస్తుంటే ఇది కోసమే.
రైతుల కష్టాన్ని కీర్తిస్తూ మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ సంక్రాంతి. కనుమ పండుగతో పూర్తయ్యే ఈ పర్వదినాన పశువులను ఆరాధించడంతో పాటు బంధుమిత్రులతో కలిసి రుచికరమైన వంటలను ఆస్వాదిస్తాం. మరి ఆ రోజు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా.. ఇలా చెప్పేయండి.
కనుమ శుభాకాంక్షలు
1. కలకాలం కలిసుండే బంధాలు,
కమ్మని విందు, వినోదాలతో
మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ
కనుమ పండుగ శుభాకాంక్షలు
2. కొత్త ధాన్యం, పాడి పశువులతో,
ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో
మీ ఇళ్లు కలకాలం సుభిక్షంగా ఉండాలని
మనసారా కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు
3. మీరూ మీ కుటుంబ సభ్యులు
కలకాలం కలిసి ఉండాలని
కష్టాలు రాకుండా మీ జీవితం
సుఖసంతోషాలతో నిండాలని
మనసారా కోరుకుంటూ..
కనుమ పండుగ శుభాకాంక్షలు
4. కనుమ మీ జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగించాలనీ,
చీకట్లను పారద్రోలి వెలుగులతో నింపాలని కోరుకుంటూ
మీకూ మీ కుటుంబ సభ్యులకూ కనుమ పండుగ శుభాకాంక్షలు
5. కమనీయ జీవితానికి కనుమ పండుగ నాంది కావాలనీ,
కమ్మని విందులు, కాంతులతో మీ జీవితం కొనసాగాలని కాంక్షిస్తూ
మీకూ మీ కుటుంబ సభ్యులకూ కనుమ పండుగ శుభాకాంక్షలు
6. కొత్త ధాన్యంతో పసిడి పంటలతో మీ ఇళ్లు నిండిపోవాలని,
కష్టాలు రాకుండా కలకాలం మీరు,
మీ కుటుంబసభ్యులూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ
కనుమ పండుగ శుభాకాంక్షలు
7. సూర్యుడి వెలుగువలె, చెరుకుగడ తీపి వలె
పంట సిరులతో, పాడి పశువులతో
మీ ఇల్లు కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ
మీకూ మీ కుటుంబ సభ్యులకూ కనుమ పండుగ శుభాకాంక్షలు
8. కమ్మని విందులతో మొదలయ్యే కనుమ
మీ జీవితం కాంతులను నింపాలనీ, కష్టాలని తరిమేయాలని
కాంక్షిస్తూ మీకూ మీ కుటుంబ సభ్యులకూ కనుమ పండుగ శుభాకాంక్షలు
9. ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ పొగొట్టాలనీ,
కోరుకున్న కోరికలన్నింటినీ నెరవేర్చాలనీ,
కలకాలం మీరు మీ కుటుంబ సభ్యులతో
కలిసి ఉండాలని కోరుకుంటూ ..
కనుమ పండుగ శుభాకాంక్షలు
10. సంక్రాంతి మూడో రోజు ముచ్చటగా సాగాలని,
కనుమ పండుగ తెచ్చే సంతోషం, రుచులు!
మీ జీవితంలో ప్రతి పనిని శుభంతో ముగించాలని,
మీరు చేయబోయే ప్రతి పని ప్రయోజనకరంగా పూర్తి కావాలని!
మీ కుటుంబం సంతోషంగా,
పరస్పర ప్రేమతో వెలిగిపోవాలని,
ఈ కనుమ పండుగ సందర్భంగా,
మీ లోగిళ్లలో ఆనందాలు వెల్లివిరియాలని!
మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
11. కనుమ పండుగ అంటేనే రుచుల జాతర,
కొత్త బియ్యంలో సున్నితం, నువ్వుల్లో చిటపటలు
పండ్లు, స్వీట్లు దాటి మరెన్నో వంటకాలున్నాయి మీ ముందర,
బంధు మిత్రుల ప్రేమలతో, కుటుంబ సభ్యుల అనురాగంతో
మూణ్నాళ్ల పండుగను పూర్తి చేసేయండి.. కనుమ పండుగ శుభాకాంక్షలు
12. కనుమ పండుగ రుచులతో నిండగా,
కోడి పందాల ఆటతో సరదాగా!
పంటలు పండిన చెట్ల మధ్యగా,
కర్షకుల కృషిని కీర్తిస్తూ..
కష్టించి పని చేసే ప్రతి ఒక్కరికీ..
ఇవే ఆనందాలు,
మరిన్ని విజయాలు,
ఇంకెన్నో సంతోషాలతో నిండిన రుచులు
తేవాలని కాంక్షిస్తూ కనుమ పండుగ శుభాకాంక్షలు!
మీకు మీ కుటుంబ సభ్యులకు మా తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు
సంబంధిత కథనం