KTR Case : కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట.. క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Best Web Hosting Provider In India 2024

KTR Case : కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట.. క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Basani Shiva Kumar HT Telugu Jan 15, 2025 01:21 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Jan 15, 2025 01:21 PM IST

KTR Case : సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు నిరాశే ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తమ క్వాష్‌ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

కేటీఆర్‌
కేటీఆర్‌
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఫార్ములా- ఈ కార్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను అపెక్స్ కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఇప్పటికే కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.

yearly horoscope entry point

ఈడీ విచారణకు..

సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో.. రేపు (గురువారం జనవరి 16న) ఈడీ అధికారుల విచారణకు కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఫార్ములా ఈ-రేసు కేసులో విచారించనున్నారు. అయితే.. అడ్వకేట్‌తో హాజరవుతానని కేటీఆర్‌ తమకు సమచారం ఇవ్వలేదని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఏసీబీ విచారణ..

జనవరి 9న ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌‌ను ఏసీబీ అధికారులు 6.30 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్‌.. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు. ఈ విచారణను జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ పర్యవేక్షించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్‌ న్యాయవాది రామచంద్రరావుకు అనుమతి ఇచ్చారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

సమాధానం చెప్పాను..

ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించానని చెప్పారు. తనకున్న అవగాహన మేరకు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న కేటీఆర్.. విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పారు. మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదని.. ఇది ఒక చెత్త కేసు అని వ్యాఖ్యానించారు.

అవినీతి ఎక్కడ..

‘రాజకీయ ఒత్తిడితో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకే తెలియడంలేదు. అసంబద్ధమైన కేసు అని అధికారులకు చెప్పాను. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు.. కొత్తగా అడిగిందేమీ లేదు. పైసలు పంపాను అని నేనే చెబుతున్నాను. డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగా’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Whats_app_banner

టాపిక్

KtrSupreme CourtTelangana NewsBrsTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024