Best Web Hosting Provider In India 2024
Women Health: పురుషులతో పోలిస్తే మహిళలకే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువట, జాగ్రత్తగా ఉండండి
Women Health: కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే మహిళలు తమ ఆరోగ్యం పట్ల మాత్రం అలసత్వం వహిస్తారు. కిడ్నీ సమస్యలు మహిళల్లోనే అధికంగా వస్తున్నట్టు అధ్యయనాలు చెప్పాయి. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాి.
ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలు చాలా మందికి కామన్ అయిపోయాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు సరైన చికిత్స లేకుండా మూత్రపిండాల వ్యాధితో మరణిస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 30-35 ఏళ్లు పైబడిన వారిలో మూత్రపిండాల వ్యాధి ఎక్కువగా వస్తోంది. కాబట్టి మహిళలు మూత్రపిండాల వ్యాధి ఉంటే కనిపించే లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు.
కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తుంది?
స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న స్త్రీలు లేదా పురుషులలో మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ఈ సమస్య లక్షణాలు ఏమిటో కూడా తెలియవు. అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే మూత్రపిండాల సంక్రమణ లక్షణాలు త్వరగా పోవు. మూత్రపిండాల వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మూత్రపిండాల వ్యాధికి కారణాలు
కిడ్నీ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ నీరు తాగడం, షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయకపోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, డయాబెటిస్, తరచూ మూత్ర విసర్జన, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, అధిక రక్తపోటు, అధికంగా మద్యం సేవించడం వంటి వాటి వల్ల మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
మహిళల్లో మూత్రపిండాల వ్యాధి లక్షణాలు
మూత్రపిండాల పనితీరు నెమ్మదిగా క్షీణించడం ప్రారంభమైతే శరీరం వివిధ సమస్యలను ఎదుర్కొంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్న చాలా మంది దీని తీవ్రతను గుర్తించలేరు. ఎందుకంటే శరీరం దాని ప్రారంభ లక్షణాలు సరిగా చూపించదు. వ్యాధి తీవ్రంగా మారాక కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అలసట, బలహీనంగా అనిపించడం, వికారం, కండరాల నొప్పి, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం, పాదాలలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రంలో రక్తం ఇవన్నీ కూడా మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది. నిద్రలేమి, దురద, చర్మం పొడిబారడం, కళ్లచుట్టూ వాపు… ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఈ వ్యాధి నివారణకు ఏం చేయాలి?
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవాలి.
ఏదైనా శారీరక సమస్య లేదా నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ మితిమీరి వాడవద్దు.
మీరు అధిక బరువుతో ఉంటే, దానిని నియంత్రించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
మీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి, రెడ్ మీట్ ఎక్కువగా తినవద్దు.
నీరు పుష్కలంగా త్రాగాలి, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవద్దు. ప్రతిరోజూ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి.
మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను పుష్కలంగా తినండి