Best Web Hosting Provider In India 2024
NNS 15th January Episode: మనోహరికి ఆరు వార్నింగ్.. ఆరు తండ్రి రామ్మూర్తే అని నోరు జారిన రాథోడ్.. ఎమోషనల్ అయిన రామ్మూర్తి
NNS 15th January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 15) ఎపిసోడ్లో ఆరు తండ్రి రామ్మూర్తే అని నోరు జారుతాడు రాథోడ్. అటు మనోహరికి ఆరు వార్నింగ్ ఇస్తుంది.
NNS 15th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజు మీద అమర్ అరవడంతో వెంటనే మిస్సమ్మ అంజుని తీసుకుని కిందకి వెళ్తుంది. డాడీ అరిచారని బాధపడకని నచ్చజెప్పుతుంది. గార్డెన్ లోకి వెళ్లిన అంజు ఇక్కడేం చేస్తున్నారు గుప్త గారు అని అడుగుతుంది. మీ జనని ఎవరిలో ప్రవేశించినదో తెలియక ఆలోచించి.. ఆలోచించి ఇక్కడ విశ్రమించాను అంటాడు గుప్త.
ఓహో అయినా ఇన్ని కష్టాలు మీకు ఎందుకు చెప్పండి.. భూలోకంలో మీరు ఎప్పుడూ లేరు కదా..? ఉన్నన్ని రోజులు హ్యపీగా చిల్ అవ్వండి అంటుంది అంజు. అయినా మాకు అంతటి మహా భాగ్యము కూడానా.. మానవులతో ఉన్న పాపానికి మెల్లగా మేము కూడా మానవుల వలె అవుతామేమో అని భయంగా ఉంది అంటాడు గుప్త.
ఆరును కనిపెట్టేసిన గుప్త
అంజు.. గుప్త దగ్గరకు వెళ్లి కష్టాలు వచ్చిన్నప్పుడే ధైర్యంగా ఉండాలి అని చెప్తుంది. పిల్ల పిచ్చుకవు అయినను నీవు అంటూ గుప్త ఉలిక్కిపడతాడు. నీకు మేము కనిపిస్తున్నానా..? అని అడుగుతాడు. అవును కనిపిస్తున్నారు అని అంజు చెప్పగానే.. ఎటుల కనిపిస్తున్నాను అంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే.. అంజులో ఆరు కనిపిస్తుంది గుప్తకు.. కోపంగా బాలిక అంటే బాలిక ఈజ్ బ్యాక్ అంటుంది.
ఎంత పని చేసితివి బాలిక యమధర్మరాజుల వారు కూడా నీవు చేయవలసింది చేయోద్దని చెప్పెను కదా అంటాడు గుప్త. ఇన్ని రోజులు మీ మాటే కదా విన్నాను అంటుంది ఆరు. ఇంతలో మనోహరి వచ్చి ఇక్కడ ఉన్నావా..? నీకోసం ఇళ్లంతా వెతుకుతున్నాను అంటుంది.
మనోహరికి ఆరు వార్నింగ్
మనోహరిని చూసి ఈ బాలిక తెలిసి అంటుందా..? తెలుసుకొనుటకు మాట్లాడుతుందా..? అనుకుంటాడు. ఆరు.. మాట్లాడుతుంది నీతోనే అని మనోహరి అంటుంది.. వినిపిస్తుంది చెప్పు అంటుంది ఆరు. ఘోరాకు నువ్వు అంజలి లోపల ఉన్నావని తెలిసిపోయింది. నిన్ను బంధించడానికి వస్తున్నాడు అని మనోహరి చెప్తుంది. తెలిసిపోయిందా..? చెప్పావా..? అంటూ నిలదీస్తుంది ఆరు. అంటే ఏంటి నేను చెప్పానని అంటున్నావా..? అని మనోహరి అడుగుతుంది.
వాడు మంత్రాలు తంత్రాలు తెలిసినవాడు. ఎలా తెలుసుకున్నాడో ఏమో అంటుంది. నన్ను చూసి జాలిపడే స్టేజ్‌లో నువ్వు లేవు మనోహరి.. ఘోర నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు..? కానీ ఇవ్వాళ నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో తెలుసుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఎమోషనల్ అయిన రామ్మూర్తి
అమర్ పోస్టల్ కవర్ తీసుకుని రామ్మూర్తి ఇంటికి వెళ్తాడు. కవర్‌లో ఉన్న ఆరు ఫోటో తీసి రామ్మూర్తికి ఇస్తాడు. ఫోటో చూసిన రామ్మూర్తి బాధపడతాడు. సంతోషంగా ఉందని నా కూతురుని ఇలాగైనా చూసుకునే భాగ్యం కల్పించారు అంటూ ఎమోషనల్ అవుతాడు.
మీ కూతురే తను అని తెలిసాక తనను మీరు ఎంత మిస్ అవుతున్నారో నేను ఊహించగలను. కానీ తనను ఎలాగూ తీసుకుని రాలేను.. కానీ తన జ్ఞాపకాలనైనా మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు.
రామ్మూర్తే ఆరు తండ్రి అని నోరు జారిన రాథోడ్
ఇంటికి వచ్చిన అమర్ అందరికీ కాశీకి వెళ్లాక ఎలా ఉండాలో చెప్తుంటాడు. ఇంతలో రాథోడ్ వచ్చి మార్నింగ్ టైం ఫ్లైట్‌కు టికెట్స్ బుక్ చేశానని చెప్తాడు. దీంతో మనోహరి అక్కడికి వెళ్లాక ఏ కారణం చేతనైనా అస్తికలు కలపడం లేటు కాకుండా చూసుకోమని అక్కడి పంతులుకు చెప్పు అంటుంది. ఇంతలో మిస్సమ్మ అక్క వాళ్ల పేరెంట్స్ గురించి తెలిస్తే బాగుండు.. అక్క అస్తికలు కలపడానికి తీసుకెళ్తే బాగుండు అంటుంది. అందుకే కదా మిస్సమ్మ రామ్మూర్తి గారిని కూడా తీసుకెళ్తున్నాం అంటాడు రాథోడ్. అందరూ షాక్ అవుతారు. ఏమన్నావు రాథోడ్ అని మిస్సమ్మ అడుగుతుంది. రాథోడ్.. మిస్సమ్మ.. ఆరు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే.. నువ్వు రామ్మూర్తి గారి గురించి అంటావేంటి అంటాడు శివరాం.
ఇంతలో అమర్ అంటే మీ నాన్న ఆరును తన పెద్దకూతురు లాంటిది అన్నారు కదా అందుకే రాథోడ్ అలా అన్నాడు అని కవర్ చేస్తాడు అమర్. ఇంతలో ఆనంద్ అమ్మకు ఫ్రెండ్ ను కూడా తీసుకెళ్దామా అని అడుగుతాడు. నేను కాకుండా మీ అమ్మకు మరో ఫ్రెండ్ ఎవరు అని మనోహరి అడుగుతుంది. మా అమ్మకు ఆర్ జే అంటే చాలా ఇష్టం. అని రేడియో ప్రోగ్రాం గురించి చెప్తారు. మీ అమ్మ ఏ ప్రోగ్రాం వినేది.. నేను కూడా ఆర్జేనే కదా..? అని అడుగుతుంది.
ఇంతలో అమర్ అడ్డుపడి ఒక్కటి అని ఏం లేదు మిస్సమ్మ టైం పాస్ కోసం ఏవేవో వినేది అంటాడు. అమ్ము మాత్రం అమ్మ రోజు ఒక్క ప్రోగ్రాం మాత్రమే వినేది అంటుంది. రాథోడ్ అంజును గుర్తు చేయగానే.. అందరూ అంజు కోసం వెతుకుతారు. ఆర్జే భాగీనే మిస్సమ్మ అని పిల్లలకు తెలిసిపోతుందా? కొడైకెనాల్ అభిమాని, అరుంధతి ఒక్కరే అని మిస్సమ్మ తెలుసుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్