Best Web Hosting Provider In India 2024
Khammam : ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం – ఆహుతైన పత్తి బస్తాలు
Khammam Cotton Market : ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మార్కెట్ యార్డ్ షెడ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల దాటికి 400కు పైగా పత్తి బస్తాలు దహనమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది… మంటలార్పుతుంది.
పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటల్లో 400కి పైగా బస్తాలు దహనమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
కాలిపోయిన పత్తి విలువ లక్షల్లో ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో ఒకే రైతుకు చెందిన 200 బస్తాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకుసంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
KhammamTelangana NewsTs Police
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.