పెళ్లి ఇంట్లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం

Best Web Hosting Provider In India 2024

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

 నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణంలో వివాహ వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి  అనుచరుల వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్‌ కెమెరాతో షూట్ చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. బనగానపల్లె పట్టణ వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి ఇంట్లో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు.

పెళ్లి ఇంటికి డ్రోన్ షూట్ చేస్తుండగా మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఓవర్‌యాక్షన్‌ చేశారు. డ్రోన్‌ కెమెరాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. తెల్లవారితే వివాహం జరగాల్సిన ఇంట్లోవారిని భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారి టీడీపీ  పార్టీకి వత్తాసు పలికారు.

దీంతో పోలీస్ స్టేషన్‌ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనపై  అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

Best Web Hosting Provider In India 2024