Best Web Hosting Provider In India 2024
Emergency Review: కంగనా రనౌత్ బాలీవుడ్ పొలిటికల్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
Emergency Review: కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ఎమర్జెన్సీ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Emergency Review: కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తూ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యథార్థ ఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్ఫడే కీలక పాత్రలు పోషించారు. ఈ బాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?
ఇందిరాగాంధీ జీవితంతో…
మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. బలహీన నాయకురాలిగా పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన ఇందిరాగాంధీ (కంగనా రనౌత్) ప్రత్యర్థులను గడగడలాడించే లీడర్‌గా ఎలా ఎదిగింది? తక్కువ కాలంలో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు చేరిన ఇందిరా రాజకీయ జీవితం ఎమర్జెన్సీ టైమ్‌లో ఎలా పతనావస్థకు చేరింది?
ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఆ టైమ్‌లో ఇందిరాపై ఎందుకు విమర్శలు వచ్చాయి? ఇందిరా గాంధీ ప్రభుత్వ పడిపోవడానికి ఆమె కొడుకు సంజయ్ గాంధీ (విషాక్ నాయర్) తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయన్నదే అంశాలను ఎమర్జెన్సీ మూవీలో కంగనా రనౌత్ చూపించింది.
కత్తి మీద సాము…
బయోపిక్ సినిమాలు చేయడం కత్తి మీద సాము లాంటిది. అందులోనూ ప్రజలకు బాగా తెలిసిన, చిరపరచితమైన వ్యక్తుల జీవితాలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. ఎమర్జెన్సీ సినిమాతో కంగనా రనౌగ్ అలాంటి సాహసమే చేసింది.
దర్శకురాలిగా…
ఎమర్జెన్సీ విషయంలో నటిగా మాత్రం కంగనా అదరగొట్టింది. ఆమె లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇందిరాగాంధీని గుర్తుచేసింది. ఇందిరా గాంధీ రోల్ కోసం కంగాన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కానీ దర్శకురాలిగా మాత్రం తబబడిపోయింది.
తెలిసిన కథతోనే…
టైటిల్ బట్టి 1975 -77 మధ్య కాలంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమేమిటి? తెర వెనుక ఏం జరిగింది? ఆ టైమ్‌లో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారన్నది చూపిస్తారేమోనని ఆడియెన్స్ అనుకున్నారు. కానీ అంశాలేవి ఈ సినిమాలో చూపించలేదు. చాలా వరకు జనాలకు తెలిసిన అందుబాటులో ఉన్న సమాచారంతోనే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించినట్లు అనిపించింది. ఎమర్జెన్జీ టైమ్‌లో ఇందిరాకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగాయి? అప్పటి రాజకీయ అంశాలను చెప్పడంలో కన్ఫ్యూజ్‌కు గురైన భావన కలిగింది.
తక్కువ స్క్రీన్ టైమ్…
తండ్రి అడుగు జాడల్లో ఇందిరా రాజకీయ ప్రవేశం, భర్తతో ఆమె అనుబంధం, ఫిరోజ్ గాంధీ మరణంతో పాటు 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్, రష్యా సాయాన్ని పొందడంలో ఇందిరా సక్సెస్ కావడం లాంటి అంశాలను పైపైన టచ్ చేస్తూ వెళ్లారు. తక్కువ స్క్రీన్ టైమ్‌లో ఎక్కువ అంశాలను చూపించాలనే తొందర కనిపించింది. క్రియేటివ్ ఫ్రీడమ్ చాలానే తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా సంజయ్ గాంధీ పాత్రను విలన్‌గా చూపించే సీన్స్ కావాలనే పెట్టినట్లుగా అనిపిస్తాయి.
అనుపమ్ ఖేర్‌తో…
కంగనా రనౌత్‌కు, జయప్రకాష్ నారాయణన్‌గా నటించిన అనుపమ్ ఖేర్ మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. ఫ్యూచర్ పీఎమ్‌గా ఆటల్ బీహారీ వాజ్‌పేయ్ (శ్రేయస్ తల్ఫడే)ను ఇందిరా మెచ్చుకునే సన్నివేశాన్ని కంగనా తీసిన విధాన బాగుంది. ఇలాంటివి మరికొన్ని సీన్స్ పడితే బాగుండేది.
చాలా వరకు కమర్షియల్ హంగులకు దూరంగా డాక్యుమెంటరీలా ఎమర్జెన్సీ సినిమా సాగుతుంది.
వంకా పెట్టలేం…
యాక్టింగ్ పరంగా సినిమాలో వంక పెట్టడానికి ఏం లేదు. కంగనా రనౌత్‌తో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్ఫడే, విషాక్ నాయర్…ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. వారి లుక్స్, కాస్ట్యూమ్స్ నుంచి లోకేషన్స్ వరకు 1970 నాటి కాలాన్ని రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించారు.
కొన్ని వర్గాలకు మాత్రమే…
కంగనా రనౌత్ ఎమర్జెన్సీ ఓ వర్గం ఆడియెన్స్‌ను మాత్రమే మెప్పిస్తుంది. యాక్టర్‌గా కంగనా రనౌత్ మెప్పించింది. డైరెక్టర్‌గా మాత్రం ఫెయిలైంది.