Nagarjuna: రోడ్లు లోని రోజుల్లోనే నాన్నగారు అలా చేశారు.. ఇప్పటికీ అది కొనసాగుతోంది.. హీరో నాగార్జున కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Nagarjuna: రోడ్లు లోని రోజుల్లోనే నాన్నగారు అలా చేశారు.. ఇప్పటికీ అది కొనసాగుతోంది.. హీరో నాగార్జున కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 17, 2025 04:21 PM IST

Nagarjuna About Nageswara Rao Annapurna Studios 50 Years: అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రోడ్లు లోని రోజుల్లోనే నాన్నగారు అలా చేశారు.. ఇప్పటికీ అది కొనసాగుతోంది.. హీరో నాగార్జున కామెంట్స్
రోడ్లు లోని రోజుల్లోనే నాన్నగారు అలా చేశారు.. ఇప్పటికీ అది కొనసాగుతోంది.. హీరో నాగార్జున కామెంట్స్

Nagarjuna Nageswara Rao Annapurna Studios 50 Years: తెలుగు సినీ రంగంలో అక్కినేని నాగేశ్వరరావు ఎంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్నారో తెలిసిందే. టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ హీరోగా ఏఎన్నారు పేరు సంపాదించుకున్నారు. అలాంటి హీరో అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన స్టూడియోసే అన్నపూర్ణ స్టూడియోస్.

yearly horoscope entry point

ఇంట్రెస్టింగ్ విశేషాలు

అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను యూట్యూబ్‌లో ఇటీవల విడుదల చేశారు. నాలుగు నిమిషాల 15 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు నాగార్జున.

ఎంతోమందికి ఉపాధి

ఆ వీడియోలో ”రోడ్లే లేని రోజుల్లో నాన్నగారు ఇక్కడికివచ్చి ఇంతపెద్ద అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎంతో మంది టెక్నిషియన్స్, కొత్త ఆర్టిస్ట్ లు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతో మందికి ఏయన్నార్‌ స్ఫూర్తి” అని కింగ్ అక్కినేని నాగార్జున అన్నారు.

మా అమ్మగారు ఉంటారని

“అన్నపూర్ణ ‌స్టూడియోస్‌‌కి 50వ ఏడు మొదలైయింది. నాన్న గారు ప్రతి సక్సెస్‌ఫుల్ మ్యాన్ వెనుక ఒక వుమెన్ ఉంటుందని నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనుక మా అమ్మగారు ఉన్నారని ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్‌ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌‌కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ప్లేస్ వారి ఫేవరేట్ ప్లేస్” అని నాగార్జున తెలిపారు.

ఆ ట్రెడిషన్ ఇప్పటికీ

“అన్నపూర్ణ స్టాఫ్‌ని మేము ఫ్యామిలీగా భావిస్తాం. ఇవాళ స్టూడియో కళకళలాడుతుందంటే అది అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. వాళ్లు అన్నపూర్ణ వారియర్స్. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మగారు నాన్నగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది” అని నాగార్జున చెప్పుకొచ్చారు.

చాలా పాజిటివ్‌గా చెబుతారు

“లైఫ్‌లో నాకు, మా పిల్లలకు, నాన్న గారు పెద్ద ఇన్స్పిరేషన్. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన లైఫ్ పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు. ఏఎన్నార్ లివ్స్ ఆన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని సంక్రాంతి సందర్భంగా నాగార్జున తెలిపారు.

నాగార్జున న్యూ మూవీ

ఇదిలా ఉంటే, నాగార్జున ఇటీవల నా సామిరంగ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కుబేర మూవీతో బిజీగా ఉన్నారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇటీవల ఈ ముగ్గురి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోలను రిలీజ్ చేశారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024