Best Web Hosting Provider In India 2024
Cooked Food in the Fridge: వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో ఎన్ని గంటలు ఉంచచ్చు? ఎంత సేపటి లోపు వీటి తినడం సురక్షితం?
Cooked Food in the Fridge: ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇళ్లే లేదు అనడంలో అతిశయోక్తి లేదు. పరిస్థితుల రీత్యా ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఎప్పుడూ కూరగాయలు, ఆహార పదార్థాలతో నిండుగా కనిపిస్తుంది. మీరు కూడా మీ ఫ్రిజ్‌లో వండిన ఆహరా పదార్థాలను పెడుతుంటారా? వీటిని ఎంత సేపటి వరకూ పెట్టొచ్చో తెలిసే పెడుతున్నారా?
చలికాలం అయినా, వేసవికాలం అయినా ఇళ్లలో ఫ్రిజ్ వాడకం ఈ రోజుల్లో సర్వసాధారణంగానే ఉంటుంది. కూరగాయలు, పండ్లతో పాటు ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో ఫ్రిజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది వారానికి సరిపడా కూరగాయలు, పండ్లను ఒకేసారి తెచ్చుకని ఫ్రెజ్ లో పెట్టుకుంటారు. అయితే చాలా సార్లు ఇంట్లో వండిన కూరలు వంటి వండిన ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. వీటిని ఎందుకు వృథాగా పడేయాలనే భావనతో ఫ్రిజ్ లో ఉంచి వాటిని తిరగి ఉపయెగిస్తారు. ఇలా చేయడం వల్ల కూరలు పాడవవు అని భావిస్తారు.
నిజానికి వండిన ఆహర పదర్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని తిరగి తినచ్చా? ఒకవేళ ఉంచినా వాటిని ఎన్ని గంటల వరకూ ఫ్రిజ్ లో నిల్వ చేయచ్చు అంటే మీ దగ్గర సమధానం ఉందా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు నిల్వ చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. కొంత సమయం వరకూ మాత్రమే ఇది ఆరోగ్యానికి హాని తలపెట్టదు. వండిన ఆహారాలను ఫ్రిజ్ లో ఎన్ని గంటల పాటు నిల్వ చేయాలి, ఎలా చేయాలి వంటి వివరాలను తెలుసుకుందాం.
వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో ఎన్ని గంటలు నిల్వ చేయచ్చు..
సాధారణంగా వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో 3 నుండి 4 రోజులు మాత్రమే నిల్వ చేయడం సురక్షితంగా ఉంటుంది. అంతకుమించి నిల్వ చేసుకుని తినడ అనారోగ్యానికి దారి తీస్తుంది. దాంట్లోకి వ్యాధికారక బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫ్రిజ్ లోని రకరకాల ఆహారాల వాసనలు, రుచులు వండిన ఆహర పదార్థాలు చెడిపోయేలా చేస్తాయి. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది.
ఆహారం నిల్వ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
1. ఆహారం తగిన సమయంలో:
వండిన తర్వాత ఆహారం రెండు గంటల లోపే ప్రిజ్ లో పెట్టాలి. ఎక్కువ సేపు ఆగితే దీంట్లోకి బ్యాక్టీరియాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. వీటిని నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.
2. ఎయిర్‌టైట్ కంటైనర్లను ఉపయోగించండి:
ఫ్రిజ్ లో నిల్వ చేసిన ఆహరాలు పాడవకుండా ఉండాలంటే వాటి మూతలు లూజుగా ఉండకుండా చూసుకోవాలి. వాటిలోకి గాలి, వాసన ప్రవేశించాయంటే ఆహారం పాడవుతుంది. కనుక వండిన ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లు, సీల్ చేయగలిగే బాక్సులనే ఉపయోగించండి.
3. తేదీ,లేబుల్ పెట్టండి:
మీర వండిన ఆహారాలను ఫ్రిజ్ లో ఉంచేసి మీరు మర్చిపోయే అవకాశాలు లేకుండా బాక్సులు లేదా కంటైనర్లపై తేదీ వ్రాయండి. ఇలా చేయడం వల్ల మీరు దాన్ని ఎన్ని రోజులు నిల్వ చేశారో గుర్తుంచుకోగలుగుతారు. మూడు రోజులు దాటకముందే తినగలగుతారు.
4. సురక్షితంగా పునఃతాపం చేయండి:
మళ్లీ వేడి చేసినప్పుడు ఆహారం 165°F (74°C) అంతర్గత ఉష్ణోగ్రత వరకు వేడి చేయండి.
5. గుర్తుంచుకోవాల్సిన లక్షణాలు:
ఫ్రిజ్ లో నుంచి బయటకు తీసిన తర్వాత ఆహారం అసహ్యంగా వాసన వస్తున్నా, రంగు మారినా లేదా ఫంగస్ కనిపించినా దాన్ని బయట పాడేయండి. వృథా కాకూడదు అనే ఆలోచనలో అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకోకండి.
అన్నింటి కన్నా ముఖ్యమైనది:
ఫ్రిజ్‌లో వండిన ఆహారాన్ని నిల్వ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మొదట, మీ ఫ్రిజ్ శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి, ఎందుకంటే మురికి ఫ్రిజ్‌లోని బ్యాక్టీరియా మీ ఆహారాన్ని త్వరగా పాడు చేస్తుంది మరియు ఇన్ఫెక్ట్ చేస్తుంది. అలాగే, ఫ్రిజ్‌లో ఒకేసారి చాలా ఆహారాన్ని నిల్వ చేయడం మానుకోండి. అలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో గాలి ప్రసరణకు స్థలం ఉండదు, దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది.
ఏ ఆహారాలు ఎంత సేపు నిల్ల చేయచ్చు..?
అన్నం:
వండిన అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. తప్పని పరిస్థితుల్లో నిల్వ చేసినా.. గరిష్టంగా ఒక రోజు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం సురక్షితం. దీని కంటే ఎక్కువసేపు నిల్వ చేసి తింటే కడుపులో అజీర్తి సమస్య వస్తుంది.
పప్పు:
వండిన పప్పును కూడా ఫ్రిజ్‌లో రెండు రోజుల కంటే ఎక్కువసేపు నిల్వ చేయకూడదు. ఈ పప్పు తినడం వల్ల కడుపులో అజీర్తి, మలబద్ధకం మరియు అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
ఇతర కూరలు:
ఏదైనా వండిన కూరగాయను ఫ్రిజ్‌లో నాలుగు నుండి ఐదు గంటల వరకు మాత్రమే నిల్వ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఉపయోగించాలి. ముఖ్యంగా మసాలా కూరను ఎక్కువసేపు నిల్వ చేయకూడదు.
సంబంధిత కథనం