Best Web Hosting Provider In India 2024
AP Cabinet Decisions : పేదలందరికీ ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం-గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు
AP Cabinet Decisions : పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులకు కేటాయించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలను, ఉద్యోగులను మూడు విధాలుగా విభజించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
AP Cabinet Decisions : పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున అర్హులకు ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
“ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకునే వారు గతంలో ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న కుటుంబాలు అయి ఉండాలి. ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు. గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు నివాసయోగ్యంలో లేవని, స్మశానాలకు పక్కన, చెరువుల్లో స్థలాలు ఇచ్చారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ స్థలాల్లో ఒక్క ఇల్లు కట్టుకున్న పరిస్థితులు లేవు. వీరందరికీ గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు చేసి, వారికి మళ్లీ తిరిగి నివాసయోగ్యమైన ప్రదేశాల్లో స్థలాలు కేటాయిస్తాం. వీరికి అర్బన్ లో 2 సెంట్లు, రూరల్ 3 సెంట్లు కేటాయిస్తాం. గతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారు ఇల్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాలు రద్దు చేస్తాము. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని కాలనీలు నిర్మించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో పాటు ఇళ్లపై సోలార్ ప్యానల్ ఉపయోగించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టని వారి స్థలాలు రద్దు చేస్తాము”- మంత్రి పార్థసారథి
“రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన అభ్యంతరం లేని స్థలాల్లో నిరుపేదలు 15-10-2019 నాటికి నిర్మించుకున్న ఇంటి స్థలాలు క్రమబద్దీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే అర్హులు. కొన్ని ప్రభుత్వాలు ఆక్రమణలను నిర్థాక్షిణ్యంగా కొట్టివేస్తున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఆక్రమణలకు గురైన ఇళ్ల స్థలాల్లో పేదలు నివసిస్తుంటే క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయించింది. 150 గజాలు వరకు పేదలకు ఉచితంగా, 150-250 గజాలకు కొంత టారిఫ్ పెట్టారు”-మంత్రి పార్థసారథి
“గ్రామ, వార్డు సచివాలయాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 11162 గ్రామ సచివాలయాలు, 3842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో విలేజ్ సెక్రటేరియట్ లో 11 మంది, వార్డు సెక్రటేరియట్ లో 10 మంది ఉద్యోగులను కేటాయించారు. ఒక ఆలోచన లేని విధంగా ఏర్పాటు చేశారు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూడు కేటగిరీలుగా విభజించారు. 3500 జనాభా పైబడి ఉంటే ఒక కేటగిరీ, 2500-3500 జనాభాకు రెండో కేటగిరీ, 2500 జనాభా కంటే తక్కువ ఉంటే మూడో కేటగిరీ సెక్రటేరియట్స్ గా విభజించారు. 2500 కంటే తక్కువ జనాభా ఉంటే.. సెక్రటేరియట్ లో 6గురిని, 2500-3500 జనాభా ఉంటే 7గురిని, 3500 జనాభా పైబడి ఉంటే 8 మంది ఉద్యోగులను సెక్రటేరియట్ కు కేటాయిస్తారు. అందుకు తగిన విధంగా సర్దుబాటు చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా మూడు విధాలుగా విభజించారు. మల్టీపర్పస్, టెక్నికల్, యాస్పిరేషన్ ఫంక్షనరీస్ కింద ఉద్యోగులను విభజిస్తారు. అధికంగా ఉన్న ఉద్యోగులను ఇతర శాఖల్లో వినియోగించుకుంటారు”- మంత్రి పార్థసారథి
టెక్నికల్ ఫంక్షనరీస్ ఉద్యోగులు -అగ్రికల్చర్, పంచాయతీ రాజ్ శాఖకు అనుబంధంగా ఉంటారు. వీరికి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, వార్డుల్లో అడ్మిస్ట్రేషన్ సెక్రటరీ హెడ్ గా ఉంటారు.
యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఉద్యోగులు – ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చే విధానాలు.. డ్రోన్స్, ఏఐ, సాంకేతిక టెక్నాలజీ అంశాలకు అనుబంధంగా పనిచేస్తారు.
“62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నాం. అన్న క్యాంటీన్లకు ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏపీఐడీసీ కింద కొప్పర్తి, తాడిగొట్ల గ్రామాల్లో 2595.7 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది”- మంత్రి పార్థసారథి
సంబంధిత కథనం
టాపిక్