PM Modi : ఏపీ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక స్థానం, ఆర్థిక ప్యాకేజీపై ప్రధాని మోదీ స్పందన

Best Web Hosting Provider In India 2024

PM Modi : ఏపీ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక స్థానం, ఆర్థిక ప్యాకేజీపై ప్రధాని మోదీ స్పందన

Bandaru Satyaprasad HT Telugu Jan 17, 2025 06:40 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Jan 17, 2025 06:40 PM IST

PM Modi On Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఏపీ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక స్థానం, ఆర్థిక ప్యాకేజీపై ప్రధాని మోదీ స్పందన
ఏపీ ప్రజల హృదయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక స్థానం, ఆర్థిక ప్యాకేజీపై ప్రధాని మోదీ స్పందన
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

PM Modi On Vizag Steel Plant : ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో, ఎన్నో పోరాటాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ పార్టీలు చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరిస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

yearly horoscope entry point

“విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ ప్లాంట్ కోసం రూ. 10,000 కోట్లకు పైగా ఈక్విటీ మద్దతును అందించాలని నిర్ణయించాము. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము”- ప్రధాని మోదీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తేవడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ ను దేశంలోనే నంబర్ వన్ గా చేస్తామన్నారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్నారు. ఈరోజు ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.

“ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు. ఈ రోజు, నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేయడానికి ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్ర పునర్ నిర్మాణంలో మనం గెలిచాము. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా , జేపీ నడ్డాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల వారి నిబద్ధతకు ధన్యవాదాలు. ఈ విజయం సాధించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి అభినందనలు. ఈ విజయం చివరి ఓటు వేసే వరకు అన్ని అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొన్న మా నాయకులు, కార్యకర్తల కృషి అంకితభావం ఫలితంగా భావిస్తున్నాను. వారి అచంచలమైన నిబద్ధతకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అద్భుతమైన విజయానికి వారిని అభినందిస్తున్నాను. ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్‌కు అచంచలమైన మద్దతు ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది వికసిత్ భారత్ – వికసిత్ ఆంధ్రలో భాగంగా ప్రధానమంత్రి మోదీ జాతి నిర్మాణం, దార్శనికతకు దోహదపడుతుందని నేను హామీ ఇస్తున్నాను.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి.కుమార స్వామి మద్దతు, సానుకూల ప్రతిస్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక కర్మాగారం కంటే ఎక్కువ – ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటాలు, స్ఫూర్తికి స్మారక చిహ్నంగా నిలుస్తుంది. అందరి హృదయాలలో, ముఖ్యంగా వైజాగ్ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఎన్నికల హామీ కాదు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రాబోతున్నాయి”- సీఎం చంద్రబాబు

“ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ ఒకనాడు ఆంధ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తామని కేంద్రం అంటే కేవలం రూ.7000 కోట్లకు అమ్మేయడానికి ఓకే అన్నది గత వైసీపీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ భూములను కారు చౌకగా కొట్టేయడానికి ప్లాన్ చేసింది జగన్ అండ్ కో. కానీ విశాఖ ఉక్కుకు అండగా నిలబడ్డారు చంద్రబాబు. కేంద్రాన్ని ఒప్పించి రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజిని సాధించారు” అని టీడీపీ ట్వీట్ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Narendra ModiChandrababu NaiduVisakhapatnamAndhra Pradesh NewsNational NewsVizag
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024