Best Web Hosting Provider In India 2024
Masturbation Benefits: హస్త ప్రయోగం చేసుకుంటే మొటిమలు వస్తాయా..? ఇందులో వాస్తవమెంత? దాని వల్ల లాభమా లేక నష్టమా?
Masturbation Benefits: మొటిమలు అనేవి చర్మంపై కనిపించే సాధారణ సమస్య. ఇవి హార్మోనల్ మార్పుల వల్ల, కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల కలగొచ్చు. ఇంకా పలు కారణాలు ఉన్నాయి. కానీ, హస్త ప్రయోగం వల్ల కూడా వస్తాయా..? తెలుసుకుందాం రండి.
హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల స్వయం తృప్తి పొందడమే కాకుండా చాలా ప్రయోజనాలున్నాయట. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో శరీరాన్ని ఉల్లాసపరిచే ఎండార్ఫిన్లు, డోపమైన్లు రిలీజ్ అవుతాయట. వీటి ఫలితంగా ఒత్తిడి తగ్గించి, చాలా చక్కటి నిద్రకు దోహదపడుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడే ప్రక్రియ వల్ల చర్మానికి సంబంధించి కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయట. తరచూ హస్త ప్రయోగం చేస్తుండటం వల్ల వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోయి వెంట్రుకలు రాలిపోవడం మొదలవుతుందట. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో సీబం కూడా ఉత్పత్తి అవుతుందట. వీటితో పాటుగా సెల్ఫ్ లవ్ చేసుకుని, ఇలా తృప్తి పడేవాళ్లలో మొటిమలు కూడా కలుగుతాయని చాలా మంది నమ్మకం.
హస్త ప్రయోగం అంటే ఏమిటి?
మొటిమలకు, హస్త ప్రయోగానికి మధ్య సంబంధం గురించి తేల్చే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు హస్త ప్రయోగం అంటే ఏమిటి? అనే విషయం. ఒక వ్యక్తి ఆమె లేదా అతడు తన జననాంగాలను తాకుతూ స్వతహాగా సంతృప్తికి లోనయ్యే ప్రక్రియను హస్త ప్రయోగం అంటారు. 2015లో జరిపిన ఒక అధ్యయన ఫలితాలు పరిశీలిస్తే, ఓ వివాహితురాలు తరచూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే ఆమెలో భావ ప్రకంపనలు తారా స్థాయికి చేరుకుంటాయట. అంతేకాకుండా ఆమెలో శృంగారంపై కోరికలు పెరిగి సెక్స్ చేసే సమయంలో త్వరగా సంతృప్తికి గురవుతారట. 019లో జరిపిన మరో స్టడీలో హస్త ప్రయోగం చేసుకున్న వారిలో నిద్ర అనేది చాలా క్వాలిటీతో నిండి ఉందని తెలిసింది. అంతేకాకుండా వారి మూడ్‌ను కూడా ఇంప్రూవ్ చేసిందట.
హస్త ప్రయోగానికి చర్మ సౌందర్యానికి నిజంగానే సంబంధముందా?
హస్త ప్రయోగం చేసుకున్నప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ అని చెప్పుకునే ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. వీటి ఫలితంగా ఒత్తిడి అనేది తగ్గుతుంది. తరచూ ఇలా జరగడం వల్ల కార్టిసల్ స్థాయిలు కూడా తగ్గిపోతుంటాయి. పరోక్షంగా చర్మంపై కూడా ఇన్ఫ్లమ్మేషన్ తగ్గిపోతుంది. ఈ ప్రక్రియ ద్వారా రక్త సరఫరా అనేది మెరుగ్గా పని చేసి చర్మంలోని పలు కణాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను వేగవంతంగా అందజేస్తుందట. ఈ విధంగా జరగడం వల్ల చర్మం సహజంగానే కాంతివంతంగా ఉంటుంది. చర్మానికి ప్రయోజనం కలుగుతుందని హస్త ప్రయోగాన్ని స్కిన్ కేర్ ట్రీట్మెంట్ కోసం వాడకడదు. ఇది కేవలం చక్కటి నిద్రకు దోహదపడుతుంది. ఆ సమయంలో చర్మం స్వతహాగా రిపేర్ చేసుకోవడానికి మాత్రమే పని చేస్తుంది.
మొటిమలకు, హస్త ప్రయోగానికి మధ్య సంబంధం:
ఇప్పటికి కూడా చాలా మందిలో హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల జరిగే బెనిఫిట్స్ మాత్రమే తెలుసు. కానీ, దీని వల్ల దుష్ప్రభవాలు కూడా ఉన్నాయట. 2006లో జరిపిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ జర్నల్ స్టడీలో మొటిమలు రావడానికి, హస్త ప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదట. ప్రత్యక్షంగా ఈ రెండు ప్రక్రియల మధ్య ఎటువంటి సాక్ష్యాలు నిరూపణ కాలేదని స్టడీలు చెబుతున్నాయి. మొటిమలు అనేవి కచ్చితంగా హార్మోనల్ ఛేంజ్‌ల వల్లనే వస్తాయి. ఇంకా చెప్పాలంటే చర్మంపై నూనె పేరుకుపోవడం, మృత కణాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉండటం వల్ల మొటిమలు వస్తుంటాయి.
సంబంధిత కథనం