TG Nominated Posts : ఆశల పల్లకిలో ‘హస్తం’ నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?

Best Web Hosting Provider In India 2024

TG Nominated Posts : ఆశల పల్లకిలో ‘హస్తం’ నేతలు..! నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎప్పుడు..?

 

TG Govt Nominated Posts : తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. అయితే క్షేత్రస్థాయిలోని చాలా మంది ముఖ్య నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమందికే అవకాశాలు దక్కగా… మరికొంత మంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారు.

 
నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్..!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్..!
 

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తైపోయింది. ఓవైపు సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో ఉంటూనే.. మరోవైపు రాజకీయంగానూ బలపడే అవకాశాలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. కట్ చేస్తే.. త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేసి… గ్రౌండ్ లో మరింత బలపడాలని భావిస్తోంది.

పదవుల భర్తీ ఎప్పుడు…?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి… పార్టీలోని చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెంచుకున్నారు. రేపు మాపు అంటూ భర్తీ ప్రకటనలు వస్తున్నప్పటికీ… ముహుర్తం మాత్రం ఖరారు కావటం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… కొన్ని పదవులను భర్తీ చేశారు. అయితే ఇంకా చాలా కార్పొరేషన్లతో పాటు జిల్లా, నియోజకవర్గస్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అయితే పార్టీ కోసం పని చేసిన నేతలను గుర్తించి… పదవులను ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని పదే పదే అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

గతేడాది చివరల్లోనే పీసీసీ అధ్యక్షుడిగావ మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించారు. ఆయన జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పదే పదే స్పష్టం చేస్తున్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా… అందరూ కలిసి పని చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. పని చేసిన వారికే గుర్తింపు ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

నామినేటెడ్ పదవులే కాదు… పార్టీ కార్యవర్గంలోనూ మార్పులు చేయనున్నారు. పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి… కొత్త నియామకాలను చేపట్టాలని టీపీసీసీ భావిస్తోంది. అయితే నామినేటెడ్ పదవులతో పాటే కార్యవర్గంలో కూడా మార్పులు చేసే విషయంపై అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిస్తోంది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్… ఈనెలాఖరా నాటికి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ఓ ప్రకటన కూడా చేశారు. అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ రాగానే…. ఈ ప్రక్రియ పట్టాలెక్కుతుందని చెప్పుకొచ్చారు.

 

అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో పార్టీలోని నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే..నామినేటెడ్‌ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని నేతలు కోరుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో… రాష్ట్ర నాయకత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టీపీసీసీ నిర్ణయం తీసుకున్నా… ఢిల్లీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుదా..? లేక మరికొన్ని రోజులు ఆపుతుందా..? అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది.

పార్టీ పరంగా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతున్నప్పటికీ పదవులు ఆశిస్తున్న నేతలు… మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని… రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆశల పల్లకిలో ఉన్న నేతల్లో ఎంత మందిని అదృష్టం వరిస్తుందో చూడాలి…!

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

 
Telangana NewsCongressRevanth ReddyTs Local Body Elections
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024