Sunny Leone: త్రిముఖ‌గా స‌న్నీలియోన్ – కొత్త హీరోతో రొమాన్స్ – ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

Sunny Leone: త్రిముఖ‌గా స‌న్నీలియోన్ – కొత్త హీరోతో రొమాన్స్ – ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

 

Sunny Leone: గ్లామ‌ర్ క్వీన్ స‌న్నీలియోన్ త్రిముఖ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రాజేష్ నాయుడు, శ్రీదేవి మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో యోగేష్ క‌ల్లే హీరోగా న‌టిస్తోన్నాడు.

 
స‌న్నీలియోన్
స‌న్నీలియోన్
 

Sunny Leone: గ్లామ‌ర్ రోల్స్‌, స్పెష‌ల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు చేరువైన స‌న్నీలియోన్ త‌న రూటు మార్చింది. కొన్నాళ్లుగా యాక్టింగ్ ఓరియెంటెడ్ మూవీస్‌, ఛాలెంజింగ్ రోల్స్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే స‌న్నీ లియోన్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీతో ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు త్రిముఖ అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేస్తోన్నారు.

 

సీఐడీ సీరియ‌ల్ ఫేమ్‌

త్రిముఖ‌ సినిమాలో నటుడు యోగేష్ కల్లే హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ మూవీతోనే సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి యోగేష్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త్రిముఖ సినిమాలో నాజర్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, ఆషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సీఐడీ సీరియ‌ల్ ఫేమ్ ఆదిత్య శ్రీవాత్స‌వ్ ఓ డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

రిలీజ్ ఎప్పుడంటే?

త్రిముఖ షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్-ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతోన్నాయి. మార్చి 2025 తెలుగు, హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో త్రిముఖ‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌, ట్విస్ట్‌ల‌తో సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు త్రిముఖ స‌రికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందిస్తోంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. త్రిముఖ సినిమాకు రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. అకిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హర్ష కల్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

హేబ్బా ప‌టేల్ హీరోయిన్‌గా…

త్రిముఖ‌తో పాటు చాణుక్యం, బెజవాడ బాయ్స్ సినిమాల్లో కూడా యోగేష్‌ క‌ల్లే న‌టిస్తోన్నాడు. చాణుక్యం సినిమాలో హేబ్బా ప‌టేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు మోటా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధ‌న్య బాలకృష్ణ, శ్రావణ్, నాగ మహేష్, ప్రభాకర్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. బెజవాడ బాయ్స్ త్వ‌ర‌లో సెట్స్‌పైకి రాబోతోంది. .

 

కొటేష‌న్ గ్యాంగ్‌…

గ‌త ఏడాది త‌మిళంలో కొటేష‌న్ గ్యాంగ్‌, ఓ మై ఘోస్ట్ సినిమాలు చేసింది స‌న్నీలియోన్‌, ప్ర‌భుదేవా పేట్టా రాప్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌లిపి ఐదు సినిమాలు చేస్తోంది.

Whats_app_banner
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024