OTT Movie: 40 కోట్ల బడ్జెట్.. 1.25 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చిన డిజాస్టర్ మూవీ

Best Web Hosting Provider In India 2024

OTT Movie: 40 కోట్ల బడ్జెట్.. 1.25 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చిన డిజాస్టర్ మూవీ

OTT Movie: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత ఓ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.1.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ మూవీ ఇది.

 
40 కోట్ల బడ్జెట్.. 1.25 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చిన డిజాస్టర్ మూవీ
40 కోట్ల బడ్జెట్.. 1.25 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చిన డిజాస్టర్ మూవీ
 

OTT Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన ఈ సినిమా గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన ఈ సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. కేవలం రూ.1.25 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే ఈ మూవీ ఎంత డిజాస్టర్ గా మిగిలిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఐ వాంట్ టు టాక్ ఓటీటీ స్ట్రీమింగ్

అభిషేక్ బచ్చన్ నటించిన మూవీ ఐ వాంట్ టు టాక్ (I Want to Talk). ఈ మూవీ శనివారం (జనవరి 18) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది నవంబర్ 22న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రముఖ దర్శకుడు షూజిత్ సిర్కార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొన్నాళ్ల కిందటే ప్రైమ్ వీడియోలోకి వచ్చినా.. రూ.279 రెంట్ విధానంలోనే చూసే వీలు కల్పించారు.

అయితే తాజాగా ఈ మూవీ సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైన విషయాన్ని ప్రైమ్ వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “అర్జున్‌లో తన గళాన్ని వినిపించే ఎంతో అవసరమైన స్టోరీ వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఐ వాంట్ టు టాక్ వచ్చేసింది. వెంటనే చూసేయండి” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

ఐ వాంట్ టు టాక్ స్టోరీ ఏంటంటే?

మూడు నేషనల్ అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న డైరెక్టర్ షూజిత్ సిర్కార్ డైరెక్ట్ చేసిన మూవీ ఐ వాంట్ టు టాక్. గతంలో పీకూ, పింక్ (తెలుగులో వకీల్ సాబ్), అక్టోబర్, సర్దార్ ఉధమ్ లాంటి అద్భుతమైన సినిమాలు అందించిన అతడు.. ఐ వాంట్ టు టాక్ టైటిల్ అలాంటిదే మరో మూవీ కూడా తీశాడు.

 

క్యాన్సర్ తో పోరాడుతూ 20కిపైగా సర్జరీలు చేయించుకున్నా ఇంకా జీవితంపై ఆశ చావని ఓ తండ్రి, అతని కూతురి మధ్య అనుబంధాన్ని చాటుతూ సాగే మూవీ ఇది. అర్జున్ అనే పాత్రలో అభిషేక్ బచ్చన్ నటనకు 100కు వంద మార్కులు పడ్డాయి. మూవీకి కూడా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

Whats_app_banner
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024