Best Web Hosting Provider In India 2024
Malayalam OTT: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు మలయాళం సినిమాలు – ఒకటి థ్రిల్లర్…ఇంకోటి కామెడీ!
Malayalam OTT:మలయాళం సినిమాలు నాయకన్ పృథ్వీ, జమీలంతే పూవన్ కోజి ఓటీటీలోకి వచ్చాయి. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన నాయకన్ పృథ్వీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ కామెడీ మూవీ జమీలంతే పూవన్ కోజి సైనా ప్లే ఓటీటీలో రిలీజైంది.
Malayalam OTT: మలయాళం సినిమాలు నాయకన్ పృథ్వీ, జమీలంతే పూవన్ కోజి ఒకే రోజు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నాయకన్ పృథ్వీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా…జమీలంతే పూవన్ కోజి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంద.ఇ
సర్వైవల్ థ్రిల్లర్…
సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నాయకన్ పృథ్వీ సినిమాలో శ్రీ కుమార్ నాయర్, ప్రణవ్ మోహన్, ప్రియా బాలన్ కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. మూడు నెలల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్‌లో…
నాయకన్ పృథ్వీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో చూడాలంటే 99 రూపాయలు చెల్లించాల్సిందే. యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు ప్రసాద్ జీ ఎడ్వర్డ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
కొండ చరియలు విరిగిపడటంతో…
రతీష్ తహశీల్దార్‌గా పనిచేస్తోంటాడు. కుయిల్మలై అనే హిల్ ఏరియాలో ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మణియన్ అనే లోకల్ లీడర్ నాయకత్వంలో స్థానిక ప్రజలు ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటారు. ఈ సమస్య గురించి మణియన్‌తో మాట్లాడటానికి అతడికి ఇంటికి వస్తాడు రతీష్. అదే టైమ్‌లో భారీగా వర్షం కురియడంతో మణియన్ ఇంటిపై కొండ చరియలు విరిగిపడతాయి. రతీష్‌తో పాటు మణియన్ భార్య, కూతురు బురదలో చిక్కుకుపోతారు. ఆ విపత్తు నుంచి వారు ఎలా ప్రాణాలతో బయపడ్డారు అన్నదే నాయకన్ పృథ్వీ కథ.
యాక్షన్ కామెడీ…
జమీలంతే పూవన్ కోజి మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో మిథున్, బిందు ఫణిక్కర్, అంజనా, సూరజ్ కీలక పాత్రలు పోషించారు. షాజహాన్ దర్శకత్వం వహించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్ దక్కించుకున్నది.
డాన్ కూతురితో ప్రేమ…
షాన్వాస్ కొచ్చిలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఓ డాన్ కూతురిని ప్రాణంగా ప్రేమిస్తాడు. డాన్‌కు భయపడి ప్రియురాలికి దూరమవుతాడు. ఆ టైమ్‌లోనే షాన్వాన్సు వెతుక్కుంటూ తల్లి జమీలా కొచ్చికి వస్తుంది. తల్లి రాకతో షాన్వాస్ జీవితం ఎలా మారిపోయింది? డాన్ కూతురిని టాక్సీ డ్రైవర్ పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనే అంశాలతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు.