Best Web Hosting Provider In India 2024
Cooking Tips: పకోడీలు, సమోసాలు వంటి వేయించిన ఆహారాలు ఎప్పుడు చేసినా క్రిస్పీగా, క్రంచీగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!
Cooking Tips: వేయించిన ఆహారాలంటే చాలా మందికి ఇష్టం. వీటిని బయట కొనుక్కునే తినే బదులు ఇంట్లోనే తయారు చేసుకుని తింటుంటారు. అయితే పకోడీలు, సమోసాలు వంటివి ఇంట్లో చేసినప్పడు బయట దొరికే వాటిలాగా కరకరలాడుతూ, క్రిస్పీగా రావడం లేదని చాలా మంది బాధపడతారు? ఈ టిప్స్ పాటించారంటే ఫర్ఫెక్ట్ క్రంచీనెస్ వస్తుంది.
రోజూ ఒకే రకమైన సాదా, సింపుల్ ఆహారం తినడం బోర్ కొట్టినప్పుడు, చాలా మంది వేయించిన ఆహరాలను తింటుంటారు. వీటిని బయట కొని తినడం ప్రమాదకరం కనుక ఇంట్లోనే చేసుకుని తినేందుకు ఇష్టపడతారు. అది వేడి వేడి బ్రెడ్ పకోడీలు అయినా, లేదా బంగాళాదుంప, ఉల్లిపాయ పకోడీలు, క్రిస్పీ కట్లెట్‌లు లేదా సమోసా వంటి ఏదైనా స్నాక్ అయినా ఇంట్లో వంటి రకరకాల స్నాక్స్ చేసుకుని తింటుంటాం. అయితే అవి పూర్తిగా క్రిస్పీగా, కరకరలాడుతూ ఉన్నప్పుడే వాటి రుచి బాగుంటుంది.
కాకపోతే ఇంట్లో వేపుడు పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు, మహిళలు తరచుగా చేసే ఫిర్యాదు ఏంటంటే.. బజార్‌లో లాగా క్రిస్పీగా, క్రంచీగా ఉండవని. కొన్నిసార్లు మెత్తగా, మరికొన్ని సార్లు నూనెతో నిండిపోయి ఉంటాయి. ఇలా అవకుండా ఉండాలంటే.. కొన్ని రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని పాటించారంటే పకోడీలు, సమోసాలు వంటి వేయించిన ఆహారాలు ఎప్పుడు తయారు చేసినా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయట. అవేంటో తెలుసుకుందాం.
ఆ చిట్కాలతో ప్రతి స్నాక్ క్రిస్పీగా ఉంటుంది
1) పూత పూయాలి:
వేపుడు పదార్థాలు ఎప్పుడు చేసినా క్రిస్పీగా, క్రంచీగా రావాలంటే వేయించే ముందు వాటిపై కార్న్‌స్టార్చ్ లేదా బ్రెడ్ ముక్కలు మొదలైన వాటి పూత పూయండి. నిజానికి, ఈ పూత ఆహార పదార్థానికి, నూనెకూ మధ్య ఒక పొరను సృష్టిస్తుంది. పూత పూయడం వల్ల వేపుడు పదార్థం లోపల మృదువుగా ఉంటుంది. బయట పూర్తిగా క్రిస్పీగా ఉంటుంది.
2) నూనె ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి:
వేయించిన ఆహారం కరకరలాడుతూ ఉండటంలో నూనె ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. నూనె తగినంత వేడిగా లేకపోతే, ఆహారం చాలా నూనెను పీల్చుకుంటుంది. అలాగే తినేటప్పుడు నూనె రుచి వస్తుంది. ముందుగా నూనెను వేడి చేయండి. అది పొగ రావడం ప్రారంభించినప్పుడు, మంటను మధ్యస్థంగా ఉంచి, ఆపై వేయించండి.
3) తక్కువ తక్కువ వేయించాలి:
మీరు తొందరపడి ఒకేసారి చాలా పకోడీలను వేయిస్తే, అవి ఎప్పుడూ క్రిస్పీగా ఉండవని నమ్మండి. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో వేయించడం వల్ల అవి సరిగ్గా ఉడకవు. అంతేకాకుండా ఇది నూనె ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది.
4) రెండు సార్లు వేయించాలి:
మీరు నిజంగా మీ ఆహారాన్ని మరింత క్రిస్పీగా చేయాలనుకుంటే, దానిని రెండుసార్లు వేయించండి. ఆహారాన్ని మొదటిసారి వేయించిన తర్వాత, దానిని నూనె నుండి తీసివేయండి. వడ్డించే ముందు, నూనెను అధిక ఉష్ణోగ్రతకు వేడి చేసి, ఆహార పదార్థాన్ని మళ్ళీ వేయించండి. రెండుసార్లు వేయించడం వల్ల ఆహారం చాలా క్రిస్పీగా, రుచికరంగా ఉంటుంది.
5) ఉప్పు వేయాలి:
మీరు తయారుచేసిన పకోడీలు తక్కువ నూనెను పీల్చుకోవాలనుకుంటే, వేడి నూనెలో అర టీస్పూన్ ఉప్పు వేసి పకోడీలను వేయించండి. పకోడీలు తక్కువ నూనెను మాత్రమే పీల్చుకోవడమే కాకుండా కరకరలాడుతూ క్రిస్పీగా తయారవుతాయి.
టాపిక్