Best Web Hosting Provider In India 2024
Power of Paanch OTT Series: రెండు ఓటీటీల్లోకి వచ్చిన నయా ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్.. పంచ భూతాలు, ఆతీత శక్తుల చుట్టూ..
Power of Paanch OTT Web Series: పవర్ ఆఫ్ పాంచ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. రెండు ఓటీటీల్లో ఈ సిరీసీ్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పంచ భూతాలను చుట్టూ ఈ ఫ్యాంటసీ సిరీస్ సాగుతుంది.
ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ ‘పవర్ ఆఫ్ పాంచ్’ ట్రైలర్‌తో మంచి క్యూరియాసిటీ పెంచింది. పంచ భూతాల చుట్టూ సాగే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. రివా అరోరా, జైవీర్ జునేజా, ఆదిత్య అరోరా, యశ్ సెహగల్, బర్ఖా బిస్త్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్ నిర్మించడంతో ఈ సిరీస్‍కు మంచి బజ్ వచ్చింది. పవర్ ఆఫ్ పాంచ్ సిరీస్ ముందుగా ఒకే ఓటీటీ కోసం ప్రకటించినా.. ఇప్పుడు రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పవర్ ఆఫ్ పాంచ్ వెబ్ సిరీస్ శుక్రవారం (జనవరి 17) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో అడుగుపెట్టింది. ఇప్పుడు జియోసినిమా ఓటీటీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. రెండు ఓటీటీల్లోనూ ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి.
ముందు నుంచి హాట్‍స్టార్‌లోనే పవర్ ఆఫ్ పాంచ్ సిరీస్ వస్తుందనే అప్‍డేట్స్ వచ్చాయి. అయితే, ఇప్పుడు దాంతో పాటు జియోసినిమా ఓటీటీలోనూ అడుగుపెట్టింది. దీంతో రెండు ఓటీటీల్లోనూ ఈ సిరీస్‍ను ఇప్పుడు చూసే అవకాశం ఉంది.
పవర్ ఆఫ్ పాంచ్ వెబ్ సిరీస్‍ను బాలాజీ టెలి ఫిల్మ్స్ పతాకంపై ఏక్తా కపూర్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ సిరీస్‍కు అతీత శక్తులు, పంచభూతాలు అదుపులో ఉండడం, మిస్టరీ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది.
పవర్ ఆఫ్ పాంచ్ స్టోరీ లైన్
బేలా తన తల్లి మాటను కాదని డెహ్రాడూన్ వెళుతుంది. అక్కడే తమ కుటుంబానికి సంబంధించిన రహస్యమైన విషయాలను తెలుసుకుంటుంది. ఆశ్చర్యపోతుంది. ఆమెకు ముగ్గురు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వారిలో ఒక్కొక్కరికి నిప్పు, నీరు, గాలిని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. వారితో బేలా జతకడుతుంది. దుష్టశక్తులను అంతం చేసేందుకు వీరి జట్టుగా పోరాడతారు. ఈ క్రమంలో వారిలోని శక్తి వారికి క్రమంగా తెలుస్తుంది. వారి సొంత జీవితాల్లోనూ సమస్యలు ఉంటాయి. వీటి చుట్టూ ఈ పవర్ ఆఫ్ పాంచ్ సిరీస్ సాగుతుంది.
జనవరి 24న స్వీట్ డ్రీమ్
డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో జనవరి 24వ తేదీన స్వీట్ డ్రీమ్స్ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో మిథిలా పాల్కర్, అమోల్ పరాశల్ లీడ్ రోల్స్ చేశారు. విక్టర్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరి కలలు మధ్య లింక్ ఉండడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మియాంగ్ చంగ్, సౌరాశని మైత్రా కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మాంగో పీపుల్ మీడియా స్వీట్ డ్రీమ్స్ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది. జనవరి 24 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ చూడొచ్చు.
సంబంధిత కథనం