Best Web Hosting Provider In India 2024
Accupressure Points: పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 పాయింట్స్ నొక్కితే 2 నిమిషాల్లో ఉపశమనం పొందొచ్చు
కడుపులో గ్యాస్ పెరిగి ఇబ్బందిగా మారిందా..? మెడిసిన్ తీసుకోవడమే గ్యాస్ నొప్పికి పరిష్కారం అనుకుంటున్నారా.. ఇదిగోండి.! అక్యుప్రెషర్ పాయింట్లను నొక్కి కూడా ఉపశమనం పొందొచ్చట.
జీవనశైలి మారుతున్న కొద్దీ ఆహార అలవాట్లు మారుతుంటాయి. ఆహారంలో మార్పుల కారణంగా జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వంటివి కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో దాదాపు అందరిలోనూ కనిపిస్తున్న ఈ సమస్య కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ కారణంగా మరిన్ని సమస్యలకు దారి తీసి, శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సమస్యకు చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ అక్యుప్రెషర్ టెక్నిక్ చాలా ఉత్తమమైన మార్గం. మరి ఈ టెక్నిక్ మీరు కూడా ప్రయత్నించాలనుకుంటే ఇలా చేయండి. శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాలపై ఒత్తిడి చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడి, కండరాలు సడలిస్తాయి. ఈ విధంగా గ్యాస్ నుంచి ఉపశమనం పొందగలం. ఏ అక్యుప్రెషర్ పాయింట్లను నొక్కితే బెనిఫిట్ పొందగలమో తెలుసుకుందాం.
SP6 పాయింట్‌ను మసాజ్ చేయండి
అక్యుప్రెషర్ పాయింట్ SP6ని మసాజ్ చేయడం వల్ల గ్యాస్‌ను, దాని వల్ల కలిగే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్ మీ చీలమండ నుండి దాదాపు మూడు అంగుళాల పైన ఉంటుంది. ఇది పొట్ట కింది అవయవాలు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గ్యాస్ ఏర్పడినప్పుడు, రెండు వేళ్లను ఈ పాయింట్‌పై ఉంచండి. ఇప్పుడు రెండు నుండి మూడు నిమిషాల పాటు సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ మసాజ్ చేయండి. దీంతో మీ పొట్టలోని గ్యాస్ బయటకు వెళ్లి, దానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
గ్యాస్ కోసం CV12 పాయింట్ నొక్కండి
గ్యాస్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి మీరు ఈ CV12 పాయింట్‌ను కూడా నొక్కవచ్చు. ఈ పాయింట్ మీ బొడ్డుకు దాదాపు నాలుగు అంగుళాల పైన ఉంటుంది. ఈ పాయింట్‌పై ఒత్తిడి చేయడం వల్ల ఉదరం, మూత్రాశయం, పిత్తాశయంపై కూడా ప్రభావం కనిపిస్తుంది. వేళ్ల సహాయంతో ఈ పాయింట్‌పై తేలికగా ఒత్తిడి చేస్తూ గుండ్రంగా మసాజ్ చేయ. దీని వల్ల కూడా మీకు గ్యాస్ నొప్పి నుండి చాలా ఉపశమనం లభిస్తుంది.
CV6 పాయింట్ కూడా ఉపశమనం కలిగిస్తుంది
పొట్టలో గ్యాస్‌ను, దాని వల్ల కలిగే నొప్పిని ఉన్నప్పుడు మీరు CV6 పాయింట్‌ను కూడా మసాజ్ చేయవచ్చు. ఈ పాయింట్‌ను కిహై పాయింట్ అని కూడా అంటారు ఇది బొడ్డుకు దాదాపు ఒకటిన్నర అంగుళాల కింద ఉంటుంది. రెండు నుండి మూడు వేళ్లతో కిహై పాయింట్‌ను నొక్కి, తేలికగా మసాజ్ చేయండి. ఈ భాగం చాలా సున్నితంగా ఉండవచ్చు కాబట్టి ఎక్కువ ఒత్తిడి చేయకండి. రెండు నుండి మూడు నిమిషాల పాటు ఇలా చేస్తే మీ పొట్టలోని గ్యాస్ బయటకు వెళ్లి, మీకు ఉపశమనం లభిస్తుంది.
ఆక్యుప్రెషర్ పాయింట్లు ప్రెస్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడ్ని సంప్రదించిన తర్వాతే మీరు ప్రయత్నించాలి.
- ఆక్యుప్రెషర్ పాయింట్లను ప్రెస్ చేసే సమయంలో, గాఢంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాస వదులుతూ ఉండాలి. ఇది మానసిక ప్రశాంతత కోసం సహాయపడుతుంది.
- ఆక్యుప్రెషర్ పాయింట్లను తగిన విధంగా మాత్రమే ప్రెస్ చేయండి. అధిక శక్తివంతంగా ప్రెస్ చేయడం వల్ల నొప్పి, గాయాలు కలుగుతాయి.
- ఏ ఆక్యుప్రెషర్ పాయింట్లను ప్రెస్ చేయాలో తెలుసుకోవాలి. వాటి స్థానాలు కచ్చితంగా తెలిసిన తర్వాత మాత్రమే నొక్కాలని నిర్ణయించుకోండి.
- గర్భవతులు, రక్తపోటు ఉన్నవారు, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆక్యుప్రెషర్ పాయింట్ల జోలికి వెళ్లకపోవడం బెటర్.
- ప్రెస్ చేసే సమయంలో శరీరం పటిష్టంగా లేదా రిలాక్స్ స్థితిలో ఉండాలి.
- అక్యుప్రెషర్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, నొప్పులు ఉన్నా ఆక్యుప్రెషర్ చేయడం ఆపండి.
సంబంధిత కథనం