Best Web Hosting Provider In India 2024
Saif Ali Khan stabbing: సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడి అరెస్ట్
Saif Ali Khan stabbing: ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపర్చిన నిందితుడిని శనివారం చత్తీస్ గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
Saif Ali Khan stabbing: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను కత్తితో తీవ్రంగా గాయపర్చిన 31 ఏళ్ల వ్యక్తిని ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అదుపులోకి తీసుకుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తన 12వ అంతస్తు నివాసంలో గురువారం తెల్లవారుజామున దొంగతానికి వచ్చిన ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) పై కత్తితో దాడి చేశాడు. ఖాన్ గాయాల నుంచి కోలుకుంటున్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
చత్తీస్ గఢ్ లో అరెస్ట్
కాగా, సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపర్చిన నిందితుడుఆకాశ్ కైలాష్ కన్నోజియా ను శనివారం చత్తీస్ గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (LGT), కోల్‌కతా షాలిమార్ మధ్య నడిచే జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో నిందితుడు ఆకాశ్ కైలాష్ కన్నోజియా ప్రయాణిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు, అతడిని దుర్గ్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ కైలాష్ కన్నోజియా జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్లు ముంబై పోలీసుల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్ పీఎఫ్ కు సమాచారం అందింది. ముంబై పోలీసులు అతని మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్, ఫోటోను ఆర్పీఎఫ్ తో పంచుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ వెంటనే దుర్గ్ కు ముందు ముంబై-హౌరా మార్గంలో ఉన్న రాజ్‌నంద్‌గావ్ స్టేషన్లో తమ సహచరులను అప్రమత్తం చేసింది. అయితే అక్కడ నిందితుడి ఆచూకీ లభించలేదు. అనంతరం దుర్గ్ రైల్వేస్టేషన్ లో రెండు బృందాలను మోహరించారు.
ఆర్ పిఎఫ్ పోస్ట్ కు తరలింపు
ముంబై పోలీసులు అందించిన ఫోటో ద్వారా అతని గుర్తింపును ధృవీకరించిన తరువాత, నిందితుడిని అదుపులోకి తీసుకొని దుర్గ్ లోని ఆర్ పిఎఫ్ పోస్ట్ కు తరలించారు. అనంతరం, ముంబై పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీసులు సాయంత్రానికి విమానంలో రాయ్ పూర్ చేరుకుని, అక్కడి నుంచి దుర్గ్ వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టనున్నారు. నిందితుడు రైలు ఇంజిన్ వెనుక జనరల్ క్లాస్ బోగీలో ప్రయాణిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link