Best Web Hosting Provider In India 2024
Karthika Deepam January 20th Episode: నిలదీసిన దీప.. కార్తీక్ కోపం.. దాసును చూసి ఏడ్చేసిన పారిజాతం.. షాక్‌లో జ్యోత్స్న
Karthika Deepam 2 Today Episode January 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో.. డబ్బు చూసి కార్తీక్‌ను నిలదీస్తుంది దీప. దీంతో కార్తీక్ కోప్పడతాడు. దాసు ఆసుపత్రిలో ఉన్నాడని తెలుస్తుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 20) ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యకు టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది అనసూయ. టిఫిన్లు త్వరగా అయిపోయాయని, గుడికి వెళదామని కాంచనను అనసూయ అడుగుతుంది. తాను కూడా వస్తానని శౌర్య అంటుంది. టిఫిన్ మళ్లీ తింటున్నావేంటి అని శౌర్యను దీప ప్రశ్నిస్తుంది. బొద్దుగా అవుతోందని అంటుంది. కార్తీక్ ఇంటికి వచ్చాక చెబుతానంటుంది దీప. అయితే, కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడని కాంచన చెబుతుంది. కార్తీక్ కంగారుగా ఎందుకు ఉన్నాడని దీప అనుకుంటుంది.
డబ్బు చూసి నిలదీసిన దీప
శౌర్య సర్జరీ కోసం కాశీ దగ్గర కార్తీక్ తీసుకున్న డబ్బు దీప కంట పడుతుంది. బీరువాలో ఉన్న డబ్బు కట్టలను దీప చూసి చేతుల్లోకి తీసుకుంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఈ డబ్బు ఎక్కడివి కార్తీక్ బాబు అని దీప అడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తుంది. తెలిసిన వారి దగ్గర డబ్బు తీసుకున్నానని కార్తీక్ అంటాడు. రెస్టారెంట్ పెట్టేందుకు తన స్నేహితుడి దగ్గర ఈ డబ్బును అప్పుగా తీసుకున్నానని అబద్ధం చెబుతాడు. “రెస్టారెంట్ పెడదామంటే అది చాలా సులువు కాదు.. చాలా లక్షలు ఖర్చవుతాయని అన్నారు. ఈ రూ.5లక్షలతో రెస్టారెంట్ ఎలా పెడతారు” అని నిలదీసినట్టుగా దీప అడుగుతుంది.
దీపపై అరిచేసిన కార్తీక్
సిటీలో పేరున్న రెస్టారెంట్ పేరు మీద పెడదామంటూ అబద్ధం చెబుతాడు కార్తీక్. దీప వరుసగా ప్రశ్నలు వేస్తుంది. దీంతో కార్తీక్ చిరాకు పడతాడు. అబద్ధం చెబుతున్నారు కార్తీక్ బాబు అని దీప అంటుంది. స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకున్నానని కార్తీక్.. అంటే దీప నమ్మదు. ఫ్రెండ్స్ దగ్గర తీసుకోరు కదా అని ప్రశ్నిస్తుంది. ఉదయం ఫోన్ వచ్చాక కంగారు పడ్డారని, బయటికి వెళ్లి హడావుడిగా వచ్చారని అడుగుతుంది. ఏమైంది కార్తీక్ బాబు అని అంటుంది. “ఏంటి దీప.. నేనేమైనా చిన్నపిల్లాడినా. ప్రతీ విషయం అందరికీ చెప్పుకోవాలా. నేనేదో నేరం చేసినట్టు నిలదీస్తావేంటి” అని కార్తీక్ కోపంగా మాట్లాడతాడు. రెస్టారెంట్ కోసమని చెప్పాను కదా అని గట్టిగా అంటాడు. కాంచన ఇది వినడంతో ఏంటి అని అడిగినా కార్తీక్ చెప్పడు.
అన్ని అబద్దాలే.. చాలా..
దాసును ఈ మధ్య ఏమైనా కలిశారా అని దీప, కాంచనను కార్తీక్ అడుగుతాడు. దాసు కనిపించడం లేదని చెబుతాడు. దాసు కోసం కాశీ వెతుకుతున్నాడని అంటారు. ఉన్నట్టుండి నాలుగు రోజులు కనిపించకుండా పోయి, దాసన్నయ్య మళ్లీ వస్తాడని కాంచన అంటుంది. శౌర్యను తీసుకొని గుడికి వెళతామని చెబుతుంది. రెస్టారెంట్ గురించి మీ అమ్మ కాంచనకు ఎందుకు చెప్పలేదని కార్తీక్‌తో దీప అంటుంది. అంతా అయ్యాక చెబుదామని అనుకుంటున్నా అని కార్తీక్ అనడంతో.. ఇది కూడా అబద్ధమేనంటుంది దీప. “నేను అన్నీ అబద్ధాలే చెబుతున్నాను.. చాలా” అని కోపం అంటాడు కార్తీక్. ఎందుకు కోప్పడతారని దీప అంటుంది.
ఏం చెప్పాలో అర్థం కాక అరుస్తున్నానని, సారీ దీప అని మనసులో అనుకుంటాడు కార్తీక్. శౌర్య ఆపరేషన్ గురించి తెలిస్తే తట్టుకోలేవని మనసులోని బాధపడతాడు. ఓ పక్క శౌర్యకు ఆరోగ్యం బాగోలేదని, మరోవైపు దాసు కనిపించడం లేదని ఆలోచిస్తాడు.
దాసు గురించి శ్రీధర్ వెటకారం
రెండు పెళ్లిళ్లు చేసుకొని తాను కష్టాలు పడతున్నానని తనకు తాను అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. శుత్రువుల ఏడుపు వల్ల విజయగర్వంతో వచ్చిన మెరుపుతో గ్లామర్ పెరిగిపోయిందని మురిసిపోతాడు. ఇంతలో కావేరి వస్తుంది. గట్టిగా దువ్వితే మీసం ఊడుతుందని వెటకారం చేస్తుంది. మీ వియ్యంకుడు (దాసు) కనిపించడం లేదని స్వప్న చెప్పిందని, అక్కడికి వెళదామని కావేరి అంటుంది. తప్పిపోయేందుకు దాసు పిల్లాడు కాదని, ఎక్కడికి వెళతాడో వాడికే తెలియదు అంటూ శ్రీధర్ మాట్లాడతాడు. ఇక మారవా అని కావేరి అంటే.. మారబోనని అంటాడు. తనను బాధపెట్టిన వారు ఏడుస్తూనే ఉంటారని శ్రీధర్ అంటాడు.
దిగాలుగా కాశీ.. ధైర్యం చెప్పిన దీప
దాసు కనిపించకపోవటంతో కార్తీక్, దీప ఇంటికి వస్తారు కాశీ, స్వప్న. కాశీ దిగాలుగా ఉంటాడు. “మామయ్య ఎక్కడికి వెళ్లి ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా” అని కాశీని స్వప్న అడుగుతుంది. ఫోన్ అయినా చేసేవారు కదా.. మనం జాగ్రత్త పడాలి స్వప్న అని దీప అంటుంది. నాన్న కనిపించకపోవడం.. ఎవరికీ ఆయన గురించి తెలియకపోవడం ఏంటి అని కాశీ.. అంటే బాబాయికి ఏం కాదు అని ధైర్యం చెబుతుంది దీప.
కాశీని ఆరా తీసిన దీప
కార్తీక్ బాబు ప్రవర్తన రెండు మూడు రోజులుగా వింతగా ఉందని, ఆయన ఎవరినో అడిగి రూ.5లక్షలు తెచ్చారని కాశీని ఆరా తీస్తుంది దీప. ఎవరో కాదు.. నేనే ఆ డబ్బు ఇచ్చానని, కానీ బావ ఆ విషయం చెప్పొద్దన్నాడు అని మనసులో అనుకుంటాడు కాశీ. “ఆ డబ్బు ఎందుకంటే రెస్టారెంట్ అంటారు. మరొకసారి ఎవరికో కట్టాలి అంటారు. కంగారు పడతారు. అడిగితే కోప్పడతారు. అవన్నీ కోపాలు కాదు కాశీ. నా మాట దాటేసేందుకు కార్తీక్ బాబు చేస్తున్న పనులు. నాకు అంతా అర్థమవుతోంది” అని దీప అంటుంది. శౌర్యను ఫ్రెండ్ ఇంటి దగ్గర వదిలిపెడదామని కార్తీక్ అంటున్నారని, శౌర్య కూడా అంగీకరించిందని దీప అంటుంది. కార్తీక్ కంగారుగా ఉన్నాడని, పొంతన లేని సమాధానాలు చెబుతుడున్నాడని చెబుతుంది. ఆ డబ్బు గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. అదంతా దూరం నుంచి విన్న కార్తీక్.. కాశీ నిజం చెబుతాడేమోనని కంగారు పడతాడు. కాశీ ఏం చెప్పడు.
దాసు గురించి చెప్పిన పోలీసులు
ఇంతలో కాశీ ఫోన్ రింగ్ అవుతుంది. కానిస్టేబుల్ కాల్ చేస్తున్నాడని అంటాడు. మీ నాన్న దాసు పీహెచ్ ఆసుపత్రిలో ఉన్నారని కాశీకి కానిస్టేబుల్ చెబుతాడు. మావయ్య ఆసుపత్రిలో ఉండడం ఏంటి అని స్వప్న కంగారు పడుతుంది. కాశీ, కార్తీక్ ఇద్దరూ కలిసి ఆసుపత్రికి బయలుదేరతారు.
దాసు దొరికాడని చెప్పిన పారు.. జ్యోత్స్న షాక్
దాసు పోలీసులకు దొరికితే పరిస్థితి ఏంటని జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. దాసు దొరికాడని కాశీ ఫోన్ చేశాడని పారిజాతం చెబుతుంది. దీంతో షాక్‌కు గురైన జ్యోత్స్న.. చేతిలో ఉన్న కాఫీ కప్పును వదిలేస్తుంది. ఎక్కడున్నాడు అత్తయ్య అని సుమిత్ర అడిగితే.. ఆసుపత్రిలో అని పారిజాతం అంటుంది. లోబీపీతో పడిపోయి ఉంటే ఎవరో ఆసుపత్రిలో చేర్చి ఉంటారని శివన్నారాయణ అంటాడు.
అంత కంగారు ఎందుకు జ్యోత్స్న
లోబీపీతో కాదు.. జ్యోత్స్న చంపాలనుకుంటే ఆసుపత్రిలో పడ్డాడని దశరథ్ మనసులో అనుకుంటాడు. దాసు దొరికాడంటే.. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావని, చేతిలోని కప్పు వదిలేసేంత టెన్షన్ ఎందుకు అని జ్యోత్స్నను దశరథ్ ప్రశ్నిస్తాడు. దీంతో కంగారు పడుతుంది జ్యోత్స్న. చేయి జారిపోయిందని బదులిస్తుంది. ముందే జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని దశరథ్ అంటాడు. “డాడీ కాఫీ కప్పు గురించి చెబుతున్నట్టుగా లేదు. ఇంక దేనికో లింక్ పెట్టి చెబుతున్నట్టుగా ఉంది” అని జ్యోత్స్న అనుకుంటుంది. దాసును వాళ్ల ఇంటికి తీసుకెళుతున్నారని, తాను అక్కడికి వెళతానని పారిజాతం అంటుంది. తాను వస్తానని జ్యోత్స్న అడుగుతుంది. దశరథ్, శివన్నారాయణ వద్దన్నా తాను వెళతానని అంటుంది. కన్నతండ్రి కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని మనసులో అనుకుంటుంది పారిజాతం. తోడుగా ఉంటుంది తీసుకెళతానని అంటుంది. జ్యోత్స్ను వెంట తీసుకెళుతుంది పారిజాతం.
కాశీ ఎమోషనల్
ఆసుపత్రిలో బెడ్‌పై తన తండ్రి దాసును చూసి ఎమోషనల్ అవుతాడు కాశీ. ఏమైందని డాక్టర్‌ను కార్తీక్ అడుగుతాడు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్నాడని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేసినట్టు డాక్టర్ చెబుతాడు. దశరథ్ చేర్పించిన విషయాన్ని దాచేస్తాడు. తీసుకొచ్చిన మనిషి పేరు చెప్పాడా అంటే.. చెప్పలేదని డాక్టర్ అంటాడు. ఈ గాయం ఎలా తగిలిదంటే.. యాక్సిడెంట్ లేకపోతే ఎవరైనా బలంగా కొట్టి ఉండొచ్చని డాక్టర్ అంటాడు. “ప్రాణానికి ప్రమాదం లేదు. దెబ్బ బలంగా తగలడంతో స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి వచ్చి.. మళ్లీ కోల్పోతున్నారు. ప్రాణాలకు ప్రమాదం లేదు కాబట్టి ఇంటికి తీసుకెళ్లొచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలి” అని డాక్టర్ అంటాడు. దాసును ఇంటికి తీసుకెళ్లేందుకు కాశీ, కార్తీక్ నిర్ణయించుకుంటారు. డాక్టర్‌కు కార్తీక్ థ్యాంక్స్ చెబితే.. ఆసుపత్రిలో చేర్పించిన ఆ వ్యక్తి గొప్పవాడని డాక్టర్ అంటాడు.
ఏడ్చేసిన పారిజాతం.. శాపనార్థాలు
దాసును ఆ పరిస్థితిలో చూసి అతడి తల్లి పారిజాతం ఏడ్చేస్తుంది. “ఏంటిరా దాసు నీకు ఈ పరిస్థితి పట్టింది. ఫోన్ పని చేయడం లేదంటే.. గుళ్లుగోపురాలు పట్టుకొని తిరుగుతున్నావని అనుకున్నా. ఇలా పేషెంట్ అవుతావని అనుకోలేదు రా” అని ఏడుస్తుంది. “ఎవడు రా నిన్ను కొట్టింది. వాళ్ల చేతులు కాళ్లు విరిగిపోయింది. వాళ్లకు మాయరోగం రాను” అంటూ శాపనార్థాలు పెడుతుంది. దీంతో దాసును కొట్టిన జ్యోత్స్న కంగారు పడుతుంది. నువ్వు ఇలా తిడితే బాబాయికి నయం అవుతుందా అని పారిజాతంతో జో అంటుంది. వరుసగా బాగానే గుర్తున్నాయే అని కార్తీక్ వెటకారంగా అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 20) ముగిసింది.
సంబంధిత కథనం