Best Web Hosting Provider In India 2024
The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి సీన్ లీక్? వీడియో వైరల్.. మూవీ రిలీజ్ కోసం ఓ తేదీపై మేకర్స్ టార్గెట్!
The Raja Saab Release: ది రాజా సాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన తేదీకి ప్రభాస్ చిత్రం విడుదల కాదని ఇటీవలే తేలిపోయింది. రాజా సాబ్ సీన్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే, కొత్త రిలీజ్ డేట్‍పై బజ్ బయటికి వచ్చింది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హారర్ జానర్లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తుండడం ఆసక్తిని మరో రేంజ్‍కు తీసుకెళ్లింది. అయితే, ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదాతో అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రాజా సాబ్ నుంచి లీక్డ్ సీన్ అంటూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‍పై కూడా బజ్ నడుస్తోంది. ఆ వివరాలివే..
సీన్ లీక్?
ది రాజా సాబ్ చిత్రం నుంచి సీన్ లీకైందంటూ ఓ వీడియో వైరల్‍గా మారింది. మాళవిక మోహనన్ గాల్లోకి ఎగిరి ఫైట్ చేసినట్టుగా ఆ వీడియోలో ఉంది. రాజా సాబ్ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి ఈ వీడియో లీకైందని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. లీక్డ్ సీన్ అంటూ ఇది వైరల్ అవుతోంది. మరి ఇది నిజంగా రాజా సాబ్ చిత్రానికి సంబంధించినదా.. వేరేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
చేతులకు రోప్స్ కట్టిన ఉన్న హీరోయిన్‍ను కర్రతో కొట్టేందుకు ఓ వ్యక్తి రాగా.. ఆమె గాల్లోకి ఎగురుతుంది. ఇదే క్రమంలో మరో రౌడీని కాలితో కొట్టింది. ఇలా ఉన్న ఈ వీడియోనే సోషల్ మీడియాలో రాజా సాబ్ సీన్ అంటూ వైరల్ అవుతోంది. మరి మూవీ టీమ్ దీనిపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
రాజా సాబ్ చిత్రానికి లీకుల బెదడ గతంలోనూ ఎదురైంది. ఈ చిత్రం నుంచి ప్రభాస్ లుక్ ఓ ఫొటో ద్వారా లీకైంది. షూటింగ్ స్పాన్ నుంచి వచ్చిన ఆ ఫొటోతో లుక్ రివీల్ అయింది.
కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన రాజా సాబ్ చిత్రం వాయిదా పడింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రివీల్ చేసిన పోస్టర్లో విడుదల తేదీన మేకర్స్ ఉంచలేదు. దీంతో ఈ చిత్రం వాయిదా పడిందని అర్థమైంది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ డేట్‍ను టార్గెట్‍గా పెట్టుకున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు లుక్‍లను మూవీ టీమ్ రివీల్ చేసింది. మోషన్ పోస్టర్లో డార్లింగ్ లుక్ డిఫెరెంట్‍గా ఉంది. మరో లుక్ స్టైలిష్‍గా కనిపిస్తోంది. ఈ సినిమాను హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు మారుతీ. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఐటమ్ పాటకు ప్రభాస్ డ్యాన్స్ ఉంటుందని ఇటీవలే మరింత హైప్ పెంచేశారు థమన్.
సంబంధిత కథనం