Donald Trump : ‘యుద్ధం ఆపేస్తా- అక్రమ చొరబాట్లను అంతం చేస్తా, అమెరికాని రక్షించేస్తా’

Best Web Hosting Provider In India 2024


Donald Trump : ‘యుద్ధం ఆపేస్తా- అక్రమ చొరబాట్లను అంతం చేస్తా, అమెరికాని రక్షించేస్తా’

Sharath Chitturi HT Telugu
Jan 20, 2025 09:58 AM IST

Donald Trump oath : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణానికి ముందు ట్రంప్​ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉన్న యుద్ధాన్ని ఆపేస్తానని, దేశంలోకి అక్రమ చొరబాట్లను అడ్డుకుంటానని, అమెరికాని రక్షిస్తానని చెప్పుకొచ్చారు.

డొనాల్డ్​ ట్రంప్​..
డొనాల్డ్​ ట్రంప్​.. (Bloomberg)

జనవరి 20న జరగనున్న అధ్యక్ష ప్రమాణస్వీకారానికి రెడీ అవుతున్న డొనాల్డ్​ ట్రంప్​.. తన మద్దతుదారుల మధ్య భారీ సభను నిర్వహించారు. ఇందులో భాగంగా అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం ప్రపంచంలో ఉన్న యుద్ధాలను ఆపేస్తానని, అమెరికాలోకి అక్రమ చొరబాట్లను అడ్డుకుంటానని భారీ హామీలు ఇచ్చారు.

yearly horoscope entry point

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలు

వాషింగ్టన్​లో జరిగిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విక్టరీ ర్యాలీ’లో హర్షాతిరేకాల మధ్య.. ‘రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దండయాత్ర ఆగిపోతుంది,’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

లక్షలాది మంది వలసదారులను అమెరికా గడ్డపై నుంచి తరిమికొట్టేందుకు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ప్రయత్నాలను ప్రారంభిస్తానని పునరుద్ఘాటించిన ట్రంప్.. “మేము మా సరిహద్దుల ఆక్రమణను ఆపబోతున్నాము,” అని అన్నారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తామని రిపబ్లికన్లు ప్రజలకు హామీ ఇచ్చారు.

“అమెరికా గడ్డపై పనిచేస్తున్న ప్రతి అక్రమ విదేశీ ముఠా సభ్యుడు, వలస నేరస్థుడిని తొలగిస్తాము,” అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. యూఎస్ సార్వభౌమ భూభాగం, సరిహద్దులపై నియంత్రణను త్వరగా రీస్టోర్​ చేస్తానని ట్రంప్​ అన్నారు.

అయితే, ప్రమాణ స్వీకారం తర్వాత అధ్యక్షుడి మొదటి కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో.. సరిహద్దు భద్రత ప్రధాన భాగం అవుతుందని, ఇందులో ఆయన మాదకద్రవ్యాల కార్టెల్స్​ని “విదేశీ ఉగ్రవాద సంస్థలు” గా వర్గీకరించే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికా-మెక్సికో సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారని నివేదిక పేర్కొంది.

ఓవల్ కార్యాలయంలో సూపర్​ స్పీడ్​తో..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ కమలా హారిస్​ని ఓడించి రెండోసారి ఓవల్ కార్యాలయానికి తిరిగి రాబోతున్న ట్రంప్ ఈ పరిస్థితిని “అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ ఉద్యమం”గా అభివర్ణించారు.

రేపటి (ప్రమాణ స్వీకారం అనంతరం) నుంచి చారిత్రాత్మక వేగంతో పనిచేస్తానని, దేశం ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ట్రంప్​ హామీనిచ్చారు.

“ఉక్రెయిన్ యుద్ధాన్ని అంతం చేస్తా.. మిడిల్ ఈస్ట్ అరాచకాలను ఆపుతా”

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ట్రంప్​. నవంబర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఫలితంగానే ఇది జరిగిందని ట్రంప్ అన్నారు.

“ఒప్పందం కుదుర్చుకున్నామని బైడెన్ చెప్పారు. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇజ్రాయెల్-హమాస్ వివాదం జరిగేదే కాదు,” అని రిపబ్లికన్ పార్టీ పేర్కొంది.

“నేను ఉక్రెయిన్లో యుద్ధాన్ని అంతం చేస్తాను, నేను మధ్యప్రాచ్యంలో గందరగోళాన్ని ఆపుతాను. మూడొవ ప్రపంచ యుద్ధం జరగకుండా నేను నిరోధిస్తాను,” అని మాటలు చెప్పారు.

రహస్య పత్రాలను బహిర్గతం చేస్తాను..

2021లో అధ్యక్షుడిగా దిగిన తర్వాత రహస్య పత్రాలను తనతో పాటు తీసుకెళ్లారని ట్రంప్​పై అభియోగాలు ఉన్నాయి. వాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పత్రాల “ఓవర్ క్లాసిఫికేషన్”ను తిప్పికొడతానని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హామీ ఇచ్చారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ, సెనేటర్ రాబర్ట్ కెన్నడీ, పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రహస్య పత్రాలను రాబోయే రోజుల్లో విడుదల చేస్తామని ఆయన అన్నారు.

ట్రంప్ తన గత పదవీకాలంలో ఇలాంటి హామీ ఇచ్చారు. వాస్తవానికి, ఆయన జెఎఫ్​కేకి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా విడుదల చేశారు. కానీ, చివరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది.

అమెరికాలోని ఐరన్ డోమ్!

క్యాపిటల్ వన్ వద్ద మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత “ఐరన్ డోమ్” క్షిపణి రక్షణ కవచం నిర్మించడం ప్రారంభించాలని అమెరికన్ సైన్యాన్ని ఆదేశిస్తానని చెప్పారు.

అమెరికా చుట్టూ అత్యాధునిక క్షిపణి రక్షణ ‘ఫోర్స్ ఫీల్డ్’ను నిర్మిస్తామని రిపబ్లికన్ పార్టీ గతంలో ప్రతిజ్ఞ చేసింది.

టిక్​టాక్​ని కాపాడాలి..

టిక్​టాక్​కి అన్ని విధాలుగా సాయం చేస్తామని డొనాల్డ్​ ట్రంప్​ పునరుద్ఘటించారు. ఫలితంగా నిషేధం కారణంగా ఆదివారం ఆగిపోయిన టిక్​టాక్​ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

ప్రమాణస్వీకారానికి ముందు జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే, మనకు వేరే మార్గం లేదు, దాన్ని మనం కాపాడుకోవాలి. బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నాయి. మేము మా వ్యాపారాన్ని చైనాకు ఇవ్వదలచుకోలేదు, మా వ్యాపారాన్ని ఇతరులకు ఇవ్వాలనుకోవడం లేదు,” అని ట్రంప్​ చెప్పుకొచ్చారు.

టిక్​టాక్​పై నిషేధం ఎందుకు పడిందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link