Best Web Hosting Provider In India 2024
Who is Himani Mor: నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న హిమానీ మోర్ ఎవరు? ఆమె కూడా క్రీడాకారిణే
Who is Himani Mor: భారత ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా హఠాత్తుగా పెళ్లి చేసుకున్నాడు. ఫొటోలను పోస్ట్ చేసి విషయాన్ని ఆలస్యంగా వెల్లడించాడు. నీరజ్ వివాహమాడిన హిమానీ మోర్ ఎవరనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన వివాహం అయిందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఫొటోలను షేర్ చేశాడు. వివాహమైన రెండు రోజులకు ఈ విషయాన్ని ప్రకటించాడు. హిమానీ మోర్‌ను నీరజ్ పెళ్లాడాడు. పెద్దల సమక్షంలో గ్రాండ్‍గా పెళ్లి జరిగింది. అయితే, నీరజ్ భార్య హిమానీ మోర్ అంటూ చాలా మంది నెట్టింట వెతికేస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
హిమానీ ఎవరంటే..
హిమానీ మోర్ సొంత ఊరు.. హర్యానాలోని సోనిపట్ జిల్లా లర్సౌలీ. పానిపట్‍లోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్‍లో ఆమె పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత డిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్‍లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారు. అమెరికాలో ఆమె చదువు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని మారిషసస్‍లోని మాక్‍కొర్మాక్ ఐసెన్‍బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‍మెంట్‍లో సైన్స్ స్పోర్ట్స్ మేనేజ్‍మెంట్, ఆడ్మినిస్ట్రేషన్‍లో హిమానీ మాస్టర్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్రాంక్లిన్ రియర్స్ యూనివర్సిటీలో టెన్నిస్ పార్ట్ టైమ్ కోచ్‍గానూ హిమానీ గతంలో పని చేశారట. అమెహెరెస్ట్ కాలేజీ టెన్నిస్ టీమ్‍ను కూడా హిమానీ మేనేజ్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం హిమానీ వయసు 25ఏళ్లుగా సమాచారం.
టెన్నిస్ క్రీడాకారిణిగా..
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2017 వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ టోర్నీలో టెన్నిస్‍లో బరిలోకి దిగారు హిమానీ మోర్. 2016లో జరిగిన జూనియర్ టెన్నిస్ ఛాంపియన్‍షిప్‍లో హిమానీ స్వర్ణ పతకం గెలిచారని.. ఆమె చదివిన స్కూల్ వెబ్‍సైట్‍లో ఉంది. హిమానీ సోదరుడు హిమాన్షు కూడా టెన్నిస్ ప్లేయరే.
తాను హిమానీని పెళ్లాడానని ఆదివారం (జనవరి 19) ఇన్‍స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు నీరజ్ చోప్రా. అయితే, వీరి వివాహం రెండు రోజుల కిందటే జరిగిందని నీరజ్ అంకుల్ భీమ్ వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ హనీమూన్‍కు వెళ్లినట్టు చెప్పారు. అయితే, ఎక్కడికి వెళ్లిన విషయం మాత్రం వెల్లడించలేదు. హిమానీ.. అమెరికాలో చదువు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2021 టోక్సో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్ గోల్డ్ గెలిచిన రెండో బారతీయుడిగా నిలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‍లో స్వర్ణ సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్‍గా చరిత్ర క్రియేట్ చేశాడు. గతేడాది పారిస్‍లోనూ గోల్డ్ సాధిస్తాడనే ఆశలు ఉండగా.. తుదిపోరులో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link