Best Web Hosting Provider In India 2024
Bigg Boss Winners: బిగ్ బాస్ విజేతలు వీళ్లే.. ప్రకటించిన స్టార్ హీరోలు.. ప్రైజ్ మనీలో 9.5 లక్షల తేడా.. ఎవరికీ ఎంతంటే?
Bigg Boss 18 And Bigg Boss Tamil 8 Winners And Prize Money: బిగ్ బాస్ హిందీ 18, బిగ్ బాస్ తమిళ 8 విజేతలు ఆదివారం ప్రకటించారు ఆ షోల హోస్ట్‌లు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి. అలాగే, వారికి వచ్చిన ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. అయితే, ఈ ప్రైజ్ మనీలో తొమ్మిదన్నర లక్షల తేడా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే!
Bigg Boss Winners And Prize Money: బిగ్ బాస్ హిందీ 18 సీజన్ విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచాడు. 104 రోజులపాటు సాగిన డ్రామా, టాస్క్‌లు, గొడవలు, లక్షల ఓట్ల తర్వాత ఆదివారం (జనవరి 19) జరిగిన బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలేలో ఇద్దరు ఫైనల్స్‌కు చేరారు. బిగ్ బాస్ 18 హోస్ట్, హీరో సల్మాన్ ఖాన్ తన సిగ్నేచర్ స్టైల్‌లో వేదిక మధ్యలో నిలబడ్డారు.
బిగ్ బాస్ 18 విన్నర్
బిగ్ బాస్ 18 టాప్ 2 ఫైనలిస్టులు కరణ్ వీర్ మెహ్రా, వివియన్ డిసేనా అతనికి ఇరువైపులా ఉన్నారు. చివరికి, ఎలిమినేట్ కంటెస్టెంట్స్ చప్పట్లుకొడుతుంటే తన స్టైల్‌లో కరణ్ వీర్ మెహ్రా చేయిని పైకెత్తి బిగ్ బాస్ 18 విజేతగా ప్రకటించాడు సల్మాన్ ఖాన్. అయితే, ఈ విజేతను ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎంపిక చేశారు.
టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ
బిగ్ బాస్ హిందీ 18 విజేతగా కరణ్ వీర్ మెహ్రా రూ. 50 లక్షల నగదు బహుమతితోపాటు బిగ్ బాస్ ఇంటి విలాసవంతమైన ఇంటీరియర్‌లకు సరిపోయే కొత్త బంగారు ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ టీవీ స్టార్ ఇప్పుడు మున్వర్ ఫరూఖీ, ఎమ్‌సీ స్టాన్, తేజస్వి ప్రకాష్ వంటి బిగ్ బాస్ విన్నర్స్ విజేతల్లో ఒకరిగా చేరాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన వివియన్ డిసేనాకు బహుమతిని మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
బిగ్ బాస్ తమిళ 8 గ్రాండ్ ఫినాలే
ఇక మరోవైపు బిగ్ బాస్ తమిళ 8 సీజన్ కూడా ముగిసిపోయింది. ఆదివారం (జనవరి 19) బిగ్ బాస్ తమిళ సీజన్ 8 వినర్‌గా ముత్తుకుమారన్ నిలిచాడు. అతనితో పోటీ పడిన సౌందర్య, విజయ్ విశాల్, పవిత్ర లక్ష్మీ, రాయన్‌లను ఓడించి విజేతగా నిలిచాడు ముత్తుకుమారన్.
తొలిసారి హోస్ట్‌గా
తొలిసారిగా బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు చేపట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బిగ్ బాస్ తమిళ 8 విజేతగా ముత్తుకుమారన్‌ను ప్రకటించి ట్రోఫీ బహుకరించాడు. దాంతో ముత్తుకుమారన్‌కు బిగ్ బాస్ ప్రైజ్ మనీ కింద రూ. 40 లక్షల 50 వేల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అలాగే, విజయ్ సేతుపతి చేతులమీదుగా ఆకర్షణీయమైన బిగ్ బాస్ తమిళ 8 టైటిల్ ట్రోఫీని అందుకున్నాడు ముత్తుకుమారన్.
ప్రైజ్ మనీలో తేడా
అయితే, బిగ్ బాస్ హిందీ 18, బిగ్ బాస్ తమిళ 8 విజేతలను ఒకేరోజు ఆదివారం (జనవరి 19) ప్రకటించారు. కానీ, వీరి ప్రైజ్ మనీలో మాత్రం తేడా ఉంది. హిందీ బిగ్ బాస్ విన్నర్‌కు 50 లక్షల ప్రైజ్ మనీ వస్తే.. తమిళ బిగ్ బాస్ విజేతకు 40.5 లక్షలు బహుమతిగా లభించింది. ఈ లెక్కన ఇద్దరి ప్రైజ్ మనీలో తొమ్మిదిన్నర లక్షల (9.5 లక్షలు) తేడా వచ్చింది.
ఎవరీ ముత్తు కుమారన్?
కాగా, ముత్తుకుమారన్ 1997 నవంబర్ 26న కరైకుడిలో జన్మించాడు. 2019లో నాన్ ముత్తు కుమారన్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. అలా యూట్యూబర్‌గా పలు బ్లాగ్స్ చేయడం, సినిమా రివ్యూలు ఇవ్వడం, సెలబ్రిటీ ఇంటరాక్టివ్ సెషన్స్‌తో క్రేజ్ తెచ్చుకున్న ముత్తుకుమారన్ బిగ్ బాస్ తమిళ 8కి కంటెస్టెంట్‌గా వెళ్లాడు. ఇప్పుడు విజేతగా నిలిచాడు.
సంబంధిత కథనం