Best Web Hosting Provider In India 2024
Alum Benefits: వామ్మో! పటికతో ఇన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? తెలిస్తే మీరూ షాక్ అవుతారు
Alum Benefits: పటిక దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ దీని వల్ల కలిగే ప్రయెజనాలు మీలో ఎంత మందికి తెలుసు..? జలుబు నుంచి జ్వరం వరకూ, చర్మం నుంచి జుట్టు వరకూ పటిక చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపగలదు. ఎలాగో తెలుసుకుందాం రండి.
పటిక అందరికీ తెలుసే ఉంటుంది. సాధారణంగా పూజలు, పరిహారాల్లో ఉపయెగించే దీంతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా. అవును ఆయుర్వేదంలో పటిక బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మిశ్రీ, నవుబోతు వంటి రకరకాల పేర్లతో పిలిచే ఈ పటికలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇది అందం, ఆరోగ్యంతో పాటు అనేక సమస్యలకు చక్కటి పరిష్కాలను చూపిస్తుంది. అవేంటో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.
పటిక ప్రత్యేకత:
తెలుపు రంగులో ఉండే పటికను శుద్ధికి చిహ్నంగా భావిస్తారు. ఎంత మురికి నీటిలో అయినా పటికను వేసి కాసేపు ఉంచితే మురకి, మట్టి అంతా కిందకు పోయి తెల్లటి, శుభ్రమైన నీరు పైకి వస్తుంది.అంతటి శక్తివంతమైన శుద్ది లక్షణాలు కలిగినది పటిక. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంట్ ఫంగల్ లక్షణాలు అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపగలదు?
1. దగ్గు:
విపరీతమైన దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా పటికతో త్వరిత ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పటిక ముక్కను తీసుకుని పొడి చేసి తేనెలో కలిపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దగ్గు నుంచైనా పరిష్కారం లభిస్తుంది.
2. జలుబు:
జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలను నుంచి బయటపడేందుకు పటికను వేడి చేసుకుని పొడి చేసుకుని తర్వాత ఆ పొడిని గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు తాగాలంటే మీ జలుబు పరార్ అయిపోతుంది.
3. ముక్కు నుండి రక్తస్రావం:
చాలా మందికి ముక్కు నుంచి తరచూ రక్తస్రావం జరుగుతుంది. అలాంటి వారు పటిక పొడిని పాలలో వేసుకుని ముక్కులో మూడు నుంచి నాలుగు చుక్కలు వేసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
4. దంత సమస్యలు, చిగుళ్ల ఆరోగ్యం:
దంతాల్లో నొప్పి, చిగుళ్లలో రక్తస్రావం వంటి అనేక రకాల దంత సమస్యలకు కూడా పటిక పరిష్కారం చూపిస్తుంది. ఇందుకోసం పటికను, కళ్ల ఉప్పును తీసుకుని(పటిక రెండింతలు, ఉప్పు ఒకింత ఉండాలి) పొడి చేసుకుని ప్రతి రోజు ఈ పొడితో దంతాలు, చిగుళ్లను శుభ్రం చేసుకోవాలి.
5. జ్వరం:
జ్వరం తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంటే పటిక మీకు సహాయపడుతుందని గుర్తుంచుకోండి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. పటిక పొడిని, సొంటి పొడినీ కలిపి ఏదైనా తీపి పదార్థంలో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే జ్వరం నుంచి కచ్చితంగా ఉపశమనం దొరుకుతుంది.
6. జుట్టు సమస్యలు:
చాలా మందికి పేలు, ఈపులు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇలాంటి బారు పటిక పొడిని స్నానం చేసే నీటిలో వేసుకుని తలస్నానం చేస్తుండాలి. ఇలా తరచూ చేయడం వల్ల పేలు, ఈపులు చనిపోవడం, పారిపోవడం వంటివి జరుగుతాయి. చుండ్రుతో ఇబ్బంది పడేవారు పటిక పొడిని షాంపూలో కలుపుకుని తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది.
7. చర్మ సమస్యలు:
తామర, దురద,రింగ్ వార్మ్ వంటి రకరకాల చర్మ సమస్యలు ఉన్నవారు పటిక నీళ్లతో ప్రభావిత ప్రాంతంలో తరచూ మర్దనా చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది. సమస్య నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. పుండ్లు, కురుపులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారు నీటిలో పటిక ముక్కను తీసుకుని పుండు ఉన్న చోట అరనిమిషం పాటు ఉంచాలి.
షేవింగ్ తర్వాత చర్మంపై దురద, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు పటిక ముక్కను నీళ్లలో కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చేరుకోకుండా ఉండి దురద, మంట వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
8. శరీరం నుంచి దుర్వాసన:
రోజుకు రెండు సార్లు స్నానం చేసినా, ఎంత శుభ్రంగా ఉన్నా కొందరి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు రోజూ స్నానం చేసే నీటిలో పటిక పొడిని కలుపుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గి మంచి వాసన వస్తుంది.
9. గొంతు సమస్యలు
గొంతు నొప్పి, గొంతులో మంట, కిచ్ కిచ్ వంటి సమస్యలున్నారు గోరు వెచ్చని నీటిలో పటిక పోడి, ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేశారంటే గొంతు సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.
10. మొటిమలు, మచ్చలు
మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు పటికపోడిని నీటిలో కలిపి మొటిమ మీద రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత అదే నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మచ్చలు ఉన్న వారు పటిక పొడి, రోజ్ వాటర్ కలిపి అప్లై చేసి కాసేపటి తర్వాత కడుక్కోవాలి.