Best Web Hosting Provider In India 2024
US Gun Firing: అమెరికాలో తుపాకీ కాల్పులు, హైదరాబాద్ ఆర్కేపురం యువకుడి మృతి
US Gun Firing: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువకుడు దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆర్కేపురంకు చెందిన రవితేజ అనే యువకుడు వాషింగ్టన్లో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు విషాదంలో మునిగిపోయారు.
US Gun Firing: అమెరికాలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ యువకుడి మృతి చెందాడు. హైదరాబాద్లోని ఆర్కేపురంకు చెందిన రవితేజ అనే యువకుడు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. వాషింగ్టన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వాషింగ్టన్లో శనివారం రాత్రి రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు.
అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోవడం అతని కుటుంబాన్ని విషాదంలో నింపింది. హైదరాబాద్ ఆర్కేపురంకు చెందిన. కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజపై దుండగులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. అతని మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2022 మార్చిలో రవితేజ అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వాషింగ్టన్లో దోపిడీ ప్రయత్నంలో దుండగులు కాల్పులు జరపడంతో అతను మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయం చేయాలని మృతుని కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.
టాపిక్