Best Web Hosting Provider In India 2024
Sankranthiki Vasthunam Box Office: చరిత్ర సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్
Sankranthiki Vasthunam Box Office: సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది. ఈసారి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డునే బ్రేక్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు అత్యధిక షేర్ సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
Sankranthiki Vasthunam Box Office: సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. వెంకటేశ్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికే సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లాంటి సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా.. ఇప్పుడు ఆరో రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఆర్ఆర్ఆర్ లాంటి మూవీ రికార్డును కూడా బ్రేక్ చేసింది.
ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్ నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఆరో రోజు ఏపీ, తెలంగాణల్లో కేవలం షేర్ రూపంలోనే రూ.12.5 కోట్లు వసూలు చేసింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
సంక్రాంతికి వస్తున్నాం ఆరో రోజు షేర్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.4.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.0.73 కోట్లు, కృష్ణాలో రూ.0.93 కోట్లు, గుంటూరులో రూ.0.89 కోట్లు, నెల్లూరులో రూ.0.39 కోట్లు, వైజాగ్ లో రూ.2.18 కోట్లు, సీడెడ్ లో రూ.2.14 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఆరో రోజు రూ.12.5 కోట్ల షేర్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.16.12 కోట్లుగా ఉంది. మొత్తంగా ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ సాధించడం విశేషం.
సంక్రాంతికి వస్తున్నాం ఆరు రోజుల వసూళ్లు ఇవీ
సంక్రాంతి రోజు అయిన జనవరి 14న రిలీజైన ఈ మూవీ.. తొలి రోజు నుంచీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ రావడంతో తర్వాతి నుంచి కూడా కలెక్షన్లు పెరుగుతూనే వెళ్లాయి.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే నెట్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లు రావడం విశేషం. కేవలం షేర్ విషయానికి వస్తే ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లతో వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ల మూవీగా రికార్డు బ్రేక్ చేసింది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్లో ఇది సెకండ్ బెస్ట్. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3ల రికార్డును ఈ సంక్రాంతికి వస్తున్నాం సులువుగా బ్రేక్ చేసేసింది.
సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి రూ.200 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన మిగిలిన రెండు సినిమాలకు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి కలిసి వస్తోంది.
టాపిక్