Best Web Hosting Provider In India 2024
Adventure Thriller OTT: శివాజీ మహారాజ్ నిధి కోసం అన్వేషణ.. ఇంట్రెస్టింగ్గా ట్రైలర్.. సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
The Secret of The Shiledars OTT Trailer: ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. శివాజీ మహారాజ్ నిధి చుట్టూ ఉండే ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ వెబ్ సిరీస్పై బజ్ ఎక్కువగా ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిధి కోసం అన్వేషణ, దాన్ని సంరక్షించేందుకు ప్రయత్నించే దళం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. సాయి తంహనకర్, రాజీవ్ ఖండేవాల్ ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ సిరీస్ ట్రైలర్ నేడు (జనవరి 20) రిలీజైంది.
ట్రైలర్ ఇలా..
శివాజీ మహారాజ్ నిధిని సంరక్షించేందుకే ఉన్న శీలేదార్స్ పరిచయంతో ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ ట్రైలర్ మొదలైంది. శివాజీ ఖజానాను సంరక్షించాల్సిన సమయం వచ్చిందని, శీలేదార్స్ సిద్ధం కావాలని ఈ ట్రైలర్లో ఉంది. ఆ నిధిని దక్కించుకునేందుకు మరో గ్రూప్ కూడా ప్రయత్నిస్తుంటుంది. దీంతో ఆ ఖజానా ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రస్తుత తరం శిలేదార్స్ ప్రయత్నిస్తారు. ఆ నిధి కోసం అన్వేషణ మొదలుపెడతారు.
ఆ నిధిని చేరే క్రమంలో వారికి సవాళ్లు, ట్విస్టులు ఎదురవుతాయి. చిక్కుముడులను వివ్పుతూ నిధికి చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆ నిధి వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ కాలం శిలేదార్స్ అక్కడికి చేరుకొని సంరక్షించారా? ఆ నిధిని చేజిక్కుంచునేందుకు ప్రయత్నిస్తున్నదెవరు? అనే అంశాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుందనేలా ట్రైలర్ ఉంది. వీటితో పాటు చాలా చారిత్రక అంశాలు, మరాఠాల సంస్కృతి ఈ సిరీస్లో ఉండనున్నాయి.
ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ స్ట్రీమింగ్ డేట్
ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో జనవరి 31వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. ఆ విషయాన్ని హాట్స్టార్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది.
ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ వెబ్ సిరీస్కు ఆదిత్య సర్పోర్ట్దార్ దర్శకత్వం వహించారు. గతేడాది ఆదిత్య తెరకెక్కించిన హారర్ మూవీ ముంజ్య భారీ బ్లాక్బస్టర్ అయింది. దీంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆదిత్య నుంచి ఈ వెబ్ సిరీస్ వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ సిరీస్లో రాజీవ్, సాయి తంహనకర్ సహా ఆశిష్ విద్యార్థి, గౌరవ్ అమ్లానీ కీరోల్స్ చేశారు.
ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ సిరీస్ను ధనలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై నితిన్ వైద్య ప్రొడ్యూజ్ చేశారు. మరాఠీ నవల ప్రతిపశ్చంద్ర నవల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించారు దర్శకుడు ఆదిత్య. జనవరి 31 హాట్స్టార్ ఓటీటీలో రానున్న మూవీపై మంచి ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం