TDP On Deputy CM Issue : లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం

Best Web Hosting Provider In India 2024

TDP On Deputy CM Issue : లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం

Bandaru Satyaprasad HT Telugu Jan 20, 2025 05:10 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Jan 20, 2025 05:10 PM IST

TDP On Deputy CM Issue : లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న టీడీపీ నేతల డిమాండ్లపై అధిష్ఠానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది.

 లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం
లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

TDP On Deputy CM Issue : మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.

yearly horoscope entry point

సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పర్యటనలో…కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు పలికారు. లోకేశ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అనంతరం పలువురు నేతలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బహిరంగ ప్రకటన చేస్తుండడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsTrending ApPawan KalyanJanasenaAp Politics
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024