US President Donald Trump : అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం

Best Web Hosting Provider In India 2024


US President Donald Trump : అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం

Anand Sai HT Telugu
Jan 20, 2025 11:04 PM IST

US President Donald Trump : అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం (ANI)

అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ప్రపంచంలోని పలువురు అగ్రనేతలు హాజరు అయ్యారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు జెడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

yearly horoscope entry point

అంతకుముందు పదవి విరమణ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌‌ను కలిసేందుకు ట్రంప్ వైట్ హౌస్ వెళ్లారు. బైడెన్ దంపతులు ట్రంప్‌కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి యూఎస్ క్యాపిటల్‌కు చేరుకున్నారు. వారితో కమలా హారిస్, జెడీ వాన్సన్ కూడా ఉన్నారు.

పారిశ్రామిక వేత్తలు, టెక్ దిగ్గజాలు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ట్రంప్‌ను ప్రధాని మోదీ రాసిన లేఖను జైశంకర్ అందజేశారు. ఈ వేడుకకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా కూడా హాజరయ్యారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌వంటి ప్రముఖులు ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో మెరిశారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link