Donald Trump : ‘వచ్చాడు.. సంతకం చేశాడు.. రిపీట్​!’ ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లతో హడలెత్తించిన ట్రంప్​!

Best Web Hosting Provider In India 2024


Donald Trump : ‘వచ్చాడు.. సంతకం చేశాడు.. రిపీట్​!’ ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లతో హడలెత్తించిన ట్రంప్​!

Sharath Chitturi HT Telugu
Jan 21, 2025 06:26 AM IST

Trump executive orders : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే డొనాల్డ్​ ట్రంప్​ రంగంలోకి దిగారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అనేక ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై సంతకం చేశారు. వీటిల్లో అనేక డాక్యుమెంట్లు.. బైడన్​ కాలం నాటి 78కిపైగా చర్యలను తిప్పికొట్టే విధంగా ఉన్నాయి.

ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై ట్రంప్​ సంతకం..
ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై ట్రంప్​ సంతకం.. (AP)

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం డొనాల్డ్​ ట్రంప్​ ఏమాత్రం ఆలస్యం చేయలేదు! బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయడమే లక్ష్యంగా రికార్డుస్థాయిలో ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లపై సంతకం చేశారు. వాషింగ్టన్​లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రజల నినాదాల మధ్య ట్రంప్ ఒక్కో డాక్యుమెంట్​పై సంతకం చేస్తూ వెళ్లారు.

yearly horoscope entry point

బైడెన్ కాలం నాటి 78 కార్యనిర్వాహక చర్యలను తొలగించడం సహా అనేక అంశాలను ట్రంప్​ సంతకం చేసిన ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు కవర్ చేశాయి. ఇది గత ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. పరిపాలన ప్రభుత్వంపై ట్రంప్​ పూర్తి నియంత్రణను కలిగి ఉన్నంత వరకు బ్యూరోక్రాట్లు కొత్త నిబంధనలను జారీ చేయకుండా నిరోధించే రెగ్యులేటరీ ఫ్రీజ్, పరిపాలన లక్ష్యాలు స్పష్టంగా వచ్చే వరకు అన్ని అత్యవసరం కాని నియామకాలను నిలిపివేసే ఫెడరల్ నియామకాలపై ఫ్రీజ్​తో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.

అమెరికన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులపైనా ట్రంప్ సంతకం చేశారు. పారిస్​ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య వివాదాస్పదంగా మారింది. అదనంగా, భావ ప్రకటనా స్వేచ్ఛను పునరుద్ధరించడం, ప్రభుత్వ సెన్సార్షిప్​ని నిరోధించడం, అలాగే రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆయుధీకరణను అంతం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు ఆదేశాలను ఇచ్చారు.

ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల పూర్తి జాబితా..

1. బైడెన్ ప్రభుత్వం నుంచి 78 కార్యనిర్వాహక చర్యలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ మెమోలు, ఇతర ఆదేశాలపై ట్రంప్​ తొలుత సంతకం చేశారు.

2. ప్రభుత్వం, పరిపాలన పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు బ్యూరోక్రాట్లు కొత్త నిబంధనలు జారీ చేయకుండా నిరోధించే రెగ్యులేటరీ ఫ్రీజ్​ని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రకటించారు.

3. పూర్తి నియంత్రణ ఏర్పడి, ప్రభుత్వ లక్ష్యాలు స్పష్టంగా తెలిసే వరకు మిలిటరీ, మరికొన్ని కేటగిరీలకు మినహా అన్ని ఫెడరల్ నియామకాలను స్తంభింపజేయాలి.

4. ఫెడరల్​ వర్కర్లు ఫుల్​ టైమ్​ పనికి రావాలని ట్రంప్​ నిర్ణయం తీసుకున్నారు.

5. అమెరికన్ కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసిన జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించాలని అధ్యక్షుడు అన్ని ఫెడరల్ విభాగాలు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.

6. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకుంటున్న ట్రంప్ ఈ నిర్ణయాన్ని అధికారిక లేఖ ద్వారా ఐక్యరాజ్యసమితికి తెలియజేస్తున్నారు.

7. అంతేకాక, భావ ప్రకటనా స్వేచ్ఛను పునరుద్ధరించాలని, భావ ప్రకటనా స్వేచ్ఛపై భవిష్యత్తులో ప్రభుత్వ సెన్సార్షిప్​ని నిరోధించాలని ఆయన ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారు.

8. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థల ఆయుధీకరణను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులను అంగీకరిస్తూ శ్వేతసౌధం సైతం ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన పెన్నులను జనంలోకి విసిరారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link