Best Web Hosting Provider In India 2024
HYD IT Raids: హైదరాబాాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు, 8 ప్రాంతాల్లో సోదాలు, సంక్రాంతి సినిమాలపై ఫోకస్…
HYD IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. జనవరి 21వ తేదీ మంగళవారం తెల్ల వారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సినీ ప్రముఖులపై ఐటీ బృందాలు దాడులు జరిపాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
HYD IT Raids: హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు జరుపుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లిహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. వందల కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించిన చిత్రాల్లో భారీగా పన్ను ఎగవేతలు ఉన్నాయని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఒక్కో చిత్రాన్ని వందల కోట్లతో నిర్మంచినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ శాఖ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రధానంగా ఐటీ శాఖ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినీ నిర్మాతలు, వారి సమీప బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు
టాపిక్