Best Web Hosting Provider In India 2024
First time Intercourse: తొలిసారి శృంగారం తర్వాత మీ శరీరం మారిపోతుందని గమనించారా? ఇట్టే పసిగట్టేయొచ్చు!
First time Intercourse: ప్రతి ఒక్కరి జీవితంలో, రిలేషన్లో తొలిసారి జరిపే శృంగారం చాలా ప్రత్యేకమైనది. ఎన్నో ఙాపకాలను తెచ్చిపెడుతుంది. దాంతోపాటు తొలిసారి జరిగే ఆ కార్యం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. వాటిని మీరు గమనించారా.. ఒకసారి చెక్ చేస్కోండి.
తొలిసారి శృంగారం తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మానసికంగానూ, శారీరకంగానూ మార్పులకు లోను చేసే ఈ ప్రక్రియ క్రమంగా శరీర తీరును కూడా మారుస్తుందట. ఆ ఇద్దరిలోనే మానసికంగానే కాకుండా ఫిజికల్‌గా కనిపించే మార్పులు ఇతరులు కూడా గమనించేలా ఉంటాయట. దాంతోపాటు మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే UTI ఇన్ఫెక్షన్కు కూడా దారి తీసే అవకాశం ఉంది. ఈ మార్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి అందరిలోనూ సహజంగా జరిగేవే. కాకపోతే ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండొచ్చు.
తొలిసారి శృంగారం జరిపిన తర్వాత శరీరంలో కలిగే మార్పులు
నొప్పిగా అనిపించొచ్చు
దాదాపు 75 శాతం మంది మహిళల్లో ఆ ప్రక్రియ తర్వాత నొప్పిగా అనిపించొచ్చు. వ్యక్తులను బట్టి కారణాలు వేరే ఉన్నా నొప్పి మాత్రం అందరిలోనూ కామన్ గా కనిపించే అంశం. పెల్విక్ కండరాలు అప్పటివరకూ బిగుతుగా ఉంటాయి. హైమన్ పొర వ్యాకోచించి వర్జినిటీ కోల్పోయే క్షణంలో అది బాగా నొప్పిగా అనిపించొచ్చు. శృంగారం జరిపే సమయంలో యాంగ్జైటీగా అనిపించినా ఆ తర్వాత నొప్పిగా ఉంటుంది. మరో కారణం కూడా ఉంది. కొన్నిసార్లు ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం వల్ల కూడా నొప్పిగా అనిపించొచ్చు.
కచ్చితంగా కనిపించే గుర్తు
తొలిసారిగా శృంగారంలో పాల్గొన్న యువతులలో కచ్చితంగా కనిపించే మార్పు బ్లీడింగ్ అవడం. హైమన్ పొర బ్రేక్ అవడం వల్ల 0.7 నుంచి 9 శాతం మహిళల్లో ఇలా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా పలచటి పొర అయిన హైమన్ పొర యోనిని కవర్ చేస్తూ ఉండే భాగం. చాలా మంది నమ్మకం ప్రకారం, ఈ పొర చీలిపోయినట్లయితే వర్జినీటీ కోల్పోయినట్లు భావిస్తారు. కానీ, అది చీలిపోవడానికి కలయిక ఒక కారణమనే చెప్పాలి. తొలిసారి అంగప్రవేశం జరిగిన తర్వాత అక్కడి చర్మం ఎర్రగా మారిపోయి తీవ్రమైన నొప్పి కలగొచ్చు.
మంటగా ఉండటం
తొలిసారి కలయిక జరిపిన తర్వాత మంట కలిగినట్లుగా అనిపిస్తుంది. యురెత్రా, వెజైనా చాలా దగ్గరగా ఉంటాయి. యోని వ్యాకోచించడం వల్ల ఆ రెండిటి మధ్య ఘర్షణ జరిగి ప్రతి నలుగురు ఆడవాళ్లలో ముగ్గురు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు.
దురదగా అనిపించడం
కొందరిలో దురద కూడా వస్తుంది. మీకు ఈ విషయం చాలా వింతగా అనిపిస్తే, మీరు వాడే కండోమ్ వల్ల కూడా అయి ఉండొచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
కలయిక జరిగే సమయంలో యోని మార్గంలో బ్యాక్టీరియా ట్రాన్సఫర్ ఉంటుంది. ఆ సమయంలో మంట కలిగినట్లుగా అనిపించడంతో నొప్పితో కూడిన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలగొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదం తప్పనిసరి.
చనుమొనలతో పాటు క్లిటోరియస్లో మార్పులు
శరీరంలో జరిగే చాలా కీలకమైన మార్పులలో ఒకటి నిపుల్స్ (చనుమొనలు), క్లిటోరియస్ పరిమాణంలో మార్పు. రక్త కణాలు వ్యాకోచించడం వల్ల స్థనాలలో మార్పు కనిపిస్తుంది. కొంతమంది మహిళల్లో కలయిక పరంగా జరిగే ఈ ప్రక్రియలో నిపుల్స్‌లో ద్రవాలు వెలువడతాయి.
హ్యాపీ హార్మోన్లు
తొలిసారి శృంగారం జరగడం అనేది మిమ్మల్ని కచ్చితంగా సంతోషంగా ఉంచుతుంది. కలయిక అనేది శరీరంలో చాలా రకాల హార్మోన్ల మార్పును కలిగిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరిచి, స్థన భాగంలో, క్లిటోరియస్ భాగంలో టెన్షన్ ఎక్కువవుతుంది. భావప్రాప్తి కలిగిన సమయంలో చనుమొనలు కాస్త గట్టిపడతాయి. ఇది శరీరంలో బ్రెయిన్లో ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం వల్ల కావొచ్చు.
యోని భాగంలో వ్యాకోచం
మహిళల శరీరంలో కనిపించే మార్పుల్లో ఇదొకటి. పరిస్థితులకు తగ్గట్టుగా యోని వ్యాకోచాన్ని అడ్జస్ట్ చేసుకోగల గుణమే ఇందుకు కారణం. కలయికకు శరీరం రెడీ అవుతున్న సమయంలో యోని ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతుందనడానికి ఇదే సంకేతం.
సంబంధిత కథనం