Best Web Hosting Provider In India 2024
OTT Top Malayalam Movies: ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 6 మలయాళం మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు..
OTT Top Malayalam Movies: ఓటీటీలోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు వచ్చాయి. థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో వచ్చిన ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
OTT Top Malayalam Movies: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ జనవరి నెలలోనే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టాయి. వీటిలో సూక్ష్మదర్శిని, పని, రైఫిల్ క్లబ్, ఐ యామ్ కాథలన్ లాంటి మూవీస్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్ ను తెరకెక్కించడంలో మలయాళం వాళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు. వీటిలో చాలా వరకు ఆ జానర్ నుంచి వచ్చిన సినిమాలే కావడం విశేషం.
ఓటీటీ టాప్ మలయాళం మూవీస్
ఓటీటీలోకి ఈ మధ్య వచ్చిన మలయాళం సినిమాల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 6 మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
పని – సోనీ లివ్ ఓటీటీ
పని (Pani) ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్యే సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలోని త్రిసూర్ ను ఏలే ఓ గ్యాంగ్‌స్టర్ కే చెమటలు పట్టించే ఇద్దరు యువకుల స్టోరీయే ఈ పని. మంచి థ్రిల్ కావాలంటే ఈ సినిమాను మిస్ కావద్దు.
ఆనంద్ శ్రీబాల – ప్రైమ్ వీడియో
ఆనంద్ శ్రీబాల ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ప్రైమ్ వీడియోతోపాటు మనోరమ మ్యాక్స్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఓ న్యాయ విద్యార్థి మరణం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అది ఆత్మహత్య అంటూ పోలీసులు కేసు క్లోజ్ చేస్తారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకునే పనిలో పడతాడు ఆనంద్ శ్రీబాల. ఇందులో లీడ్ రోల్లో అర్జున్ అశోకన్ నటించాడు.
ఐ యామ్ కాథలన్ – మనోరమ మ్యాక్స్
ప్రేమలు మూవీ కాంబినేషన్ తెలుసు కదా. నస్లేన్ గఫూర్, డైరెక్టర్ గిరీష్ ఏడీ కాంబినేషన్లోనే వచ్చిన మరో మూవీ ఐ యామ్ కాథలన్. గతేడాది ఓ ఫన్నీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీళ్లు.. ఈసారి క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాతో వచ్చారు. ఈ ఐ యామ్ కాథలన్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో కేవలం మలయాళం ఆడియోతోనే స్ట్రీమింగ్ అవుతోంది.
రైఫిల్ క్లబ్ – నెట్‌ఫ్లిక్స్
రైఫిల్ క్లబ్ ఓ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటించిన రైపిల్ క్లబ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆశిక్ అబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.
సూక్ష్మదర్శిని – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
సూక్ష్మదర్శిని ఓ బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ నటుడు బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించాడు. ఫహాద్ ఫాజిల్ భార్య, నటి నజ్రియా కూడా ఇందులో నటించింది. ఓ బేకరీ ఓనర్ కొత్తగా ఓ కాలనీలోకి వస్తాడు.
అయితే అప్పటికే అక్కడ ఉండే ఓ అమ్మాయి అతని ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో అతని తల్లి కనిపించకుండాపోవడంతో ఆ అనుమానం మరింత బలపడుతుంది. ఈ సూక్ష్మదర్శిని మూవీ హాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
పంచవల్సర పద్ధతి – మనోరమ మ్యాక్స్
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ప్రేమ్‌లాల్ డైరెక్ట్ చేసిన మూవీ ఈ పంచవల్సర పద్ధతి. ఈ మూవీ ఈ మధ్యే మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఈ రూరల్ సెటైరికల్ డ్రామా కేరళలోని ఓ గ్రామంలోని ప్రజలు స్థానిక జానపద కథల్లోని కళంబసురుడిని చూశామంటూ హంగామా చేస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారిపోయాయన్నది ఈ మూవీలో చూడొచ్చు. మనోరమ మ్యాక్స్ లో కేవలం మలయాళం ఆడియోతోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్