Best Web Hosting Provider In India 2024
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరుగునపరచద్దు
కూటమి ప్రభుత్వం వెంటనే పెండింగ్ పనులు పూర్తిచేసి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున
అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ నేతల నివాళులు
విజయవాడ: విజయవాడ స్వరాజ్ మైదానంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, పలువురు పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.
కుట్రలు ఆపండి:
గత ఏడాది వైయస్ జగన్ గారు ఉన్నతమైన ఆశయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి భావితరాలు తెలుసుకోవాలని ఏర్పాటుచేశారు, ఆ విగ్రహ కమిటీకి నేను అధ్యక్షత వహించాను, ఈ విగ్రహంపై కూటమి ప్రభుత్వం రాగానే నీలినీడలు కమ్ముకున్నాయి, ఆయన విగ్రహం ముందు ఉన్న పేర్లు తొలగించారు, ఈ పార్క్‌కు సంబంధించి పెండింగ్ పనులు అన్నీ ఆపేశారు, సాయంత్రం సమయంలో విగ్రహం కనిపించకుండా లైట్లు కూడా తీసేశారు, ప్రేవేట్ వ్యక్తులకు ఈ ప్రాంతం అద్దెకు ఇచ్చే చర్యలు తీసుకున్నారు, ఇది దారుణం, గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిలో మా హయాంలో ఏర్పాటు చేస్తామన్నారు కానీ చేయలేదు, దేశం గర్వించేలా విజయవాడ నడిబొడ్డున వైయస్ జగన్ గారి హయాంలో ఏర్పాటు చేశారు, కానీ ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ పూర్తిచేయలేదు, కాంపౌండ్ వాల్ పూర్తి చేయలేదు, నిధులన్నీ శాంక్షన్ అయినా ఎందుకు పనులు పూర్తిచేయకుండా ఆపేశారో కూటమి నేతలు చెప్పాలి, యాత్రికులు రాకుండా ఆపుతున్నారు, కుట్రలు ఆపండి, అంబేద్కర్ గారి విగ్రహానికి మా ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులు అన్నీ యధావిధిగా అమలుచేయాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.
విగ్రహానికి రక్షణ కల్పించాలి
అంబేద్కర్ విగ్రహం వద్ద పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలని, జాతి గర్వించే నాయకుడి విగ్రహానికి రక్షణ కల్పించాలని మేరుగు నాగార్జున కోరారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం లేదని తెలిసింది, వారికి తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలి, ఇటీవల కర్ణాటక మంత్రి స్వయంగా వచ్చి ఈ విగ్రహం చూసి గొప్పగా ఉందని కితాబిచ్చారు, జగన్ గారిని పొగిడారు. అంతటి మహా శిల్పంపై ఎందుకు కూటమి నేతలు శీతకన్ను వేశారు, వైయస్ జగన్‌గారికి పేరు వస్తుందని మీ భయమా, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఎలాంటి విచారణ అయినా చేయచ్చు మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.