Best Web Hosting Provider In India 2024
Venu Swamy : నాగచైతన్య-శోభిత వైవాహిక జీవితంపై వివాదాస్పద జోస్యం-క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మహిళా కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కమిషన్ ఎదుట హాజరైన ఆయన క్షమాపణలు చెబుతూ లేఖ అందించారు.
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మహిళా కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. తప్పనిసరిగా మహిళా కమిషన్ ఎదుట హాజరుకావాలని కోర్టు వేణుస్వామిని ఆదేశించింది. దీంతో ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఎదుట హాజరై.. తాను మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని, క్షమాపణలు చెబుతూ లేఖ అందించారు.
హీరో నాగచైతన్య-శోభిత పెళ్లి సమయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు…మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని వేణుస్వామిని ఆదేశించింది. దీంతో మంగళవారం వేణుస్వామి మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి…లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు.
నాగచైతన్య, శోభిత ఇటీవల వివాహం చేసుకున్నారు. వీరి వివాహ సమయంలో ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండరని, విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జోస్యం చెప్పారు. వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో మహిళా కమిషన్ ఎదుట హాజరై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కమిషన్ వేణుస్వామిని హెచ్చరించింది.
వేణుస్వామి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటామని చెప్పడం, అది జరగడంతో…మీడియా ఆయన వెంటపడింది. దీంతో వేణుస్వామి పాపులర్ అయ్యారు. అనంతరం పొలిటికల్ జ్యోసం వైపు మరలిన ఆయన…తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారం చేపడతాయని చెప్పి కంగుతిన్నారు. ఏపీలో కూటమి పార్టీలు గెలిచిన అనంతరం ఇకపై రాజకీయ జ్యోతిష్యాలు చెప్పనని ప్రకటించారు.
సంబంధిత కథనం
టాపిక్