Telugu Serial: సీరియ‌ల్ ఫ్యాన్స్‌కు షాక్ – త్రిన‌య‌ని సీరియ‌ల్‌కు శుభం కార్డు? – ఐదేళ్ల త‌ర్వాత ఎండ్‌!

Best Web Hosting Provider In India 2024

Telugu Serial: సీరియ‌ల్ ఫ్యాన్స్‌కు షాక్ – త్రిన‌య‌ని సీరియ‌ల్‌కు శుభం కార్డు? – ఐదేళ్ల త‌ర్వాత ఎండ్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2025 06:19 AM IST

Telugu Serial: జీ తెలుగు గ‌త ఐదేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న త్రిన‌య‌ని సీరియ‌ల్ త్వ‌ర‌లోనే ముగియ‌బోతున్న‌ది. జ‌న‌వ‌రి 25తో ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు ప‌డ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సీరియ‌ల్ ఎండ్ కాబోతున్న‌ట్లు లీడ్ యాక్ట‌ర్ చందు గౌడ వెల్ల‌డించాడు. లాస్ట్ డే షూట్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

తెలుగు సీరియల్
తెలుగు సీరియల్

Telugu Serial: జీ తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా త్రిన‌య‌ని కొన‌సాగుతోంది. 2020లో ఈ సీరియ‌ల్ మొద‌లైంది. గ‌త ఐదేళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా టెలికాస్ట్ అవుతూ సీరియ‌ల్ ల‌వ‌ర్స్ అభిమానాన్ని చూర‌గొంటున్న ఈ సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే శుభంకార్డు ప‌డ‌బోతున్న‌ది. ఈ విష‌యాన్ని సీరియ‌ల్ హీరో చందు గౌడ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. లాస్ట్ డే షూట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. త్రిన‌య‌ని సీరియ‌ల్ క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

yearly horoscope entry point

టైమ్ ఛేంజ్‌…

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే త్రిన‌య‌ని సీరియ‌ల్ ముగియ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. టైమ్ స్లాట్ ఛేంజ్ చేశారు. రాత్రి ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియ‌ల్‌ను మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు షిప్ట్ చేశారు. దాంతో మ‌రికొన్నాళ్ల పాటు త్రిన‌య‌ని సీరియ‌ల్‌ను కొన‌సాగిస్తార‌ని సీరియ‌ల్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వారికి షాకిస్తూ ఈ వీక్‌లోనే ఈ సీరియ‌ల్‌ను ముగిం,బోతున్నారు. జ‌న‌వ‌రి 25 నాటి ఎపిసోడ్‌తో ఈ సీరియ‌ల్ ముగియ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కొత్త సీరియ‌ల్‌…

జ‌న‌వ‌రి 27 నుంచి జీ తెలుగులో ఎన్నాళ్లో వేచిన హృద‌యం సీరియ‌ల్ ప్రారంభం కాబోతుంది. త్రిన‌య‌ని స్థానంలోనే ఈ కొత్త సీరియ‌ల్ టెలికాస్ట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్రిన‌య‌ని సీరియ‌ల్‌లో చందు గౌడ‌, ఆషికా ప‌దుకొణే లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. చైత్ర కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. త్రిన‌య‌నిగా ఆషికా ప‌దుకొణే, తిలోత్త‌మ‌గా క్యారెక్ట‌ర్‌ను చైత్ర చేస్తోన్నారు. ఈ సీరియ‌ల్‌లో తిలోత్త‌మ పాత్ర‌లో చాలా కాలం పాటు ప‌విత్రా జ‌య‌రామ్ క‌నిపించింది. గ‌త‌ ఏడాది జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప‌విత్రా జ‌య‌రామ్ క‌న్నుమూయ‌డంతో ఆమె స్థానంలో చైత్ర‌ను మేక‌ర్స్ సెలెక్ట్ చేశారు.

లేటెస్ట్ టీఆర్‌పీ ఎంతంటే?

త్రిన‌య‌ని సీరియ‌ల్ జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా చాలా కాలం పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రైమ్ టైమ్‌లో టెలికాస్ట్ అవుతోన్న‌ప్పుడు టీఆర్‌పీ ప‌రంగా టాప్ ఫైవ్‌లో ఈ సీరియ‌ల్ కొన‌సాగుతూ వ‌చ్చింది. టైమ్ ఛేంజ్ చేయ‌డంతో రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది. లేటెస్ట్ టీఆర్‌పీలో 2.16 రేటింగ్‌తో డిస‌పాయింట్ చేసింది. .

అన్న‌పూర్ణ స్టూడియోస్‌…

త్రిన‌య‌ని సీరియ‌ల్‌కు దినేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అంజ‌న్ మేగోటి క‌థ‌ను అందించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సీరియ‌ల్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. త్రిన‌య‌ని సీరియ‌ల్ త‌మిళం, మ‌ల‌యాళం, బెంగాళీ, మ‌రాఠీతో పాటు మ‌రికొన్ని భాష‌ల్లో డ‌బ్ అయ్యింది. అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

త‌మిళంలో మారి…

త్రిన‌య‌ని సీరియ‌ల్ త‌మిళంలో మారి పేరుతో రీమేక్ అయ్యింది. త‌మిళ వెర్ష‌న్‌లో ఆషికా ప‌దుకొణే టైటిల్ పాత్ర‌లో న‌టించింది. 2022లో త‌మిళ సీరియ‌ల్ మొద‌లైంది. అర్థాంత‌రంగా ఈ సీరియ‌ల్ నుంచి ఆషికా ప‌దుకొణే త‌ప్పుకున్న‌ది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. 800 ఎపిసోడ్స్ త‌ర్వాత ఆషికా సీరియ‌ల్ నుంచి త‌ప్పుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024