Best Web Hosting Provider In India 2024
Game Changer OTT: గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?
Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలో అంచనాలకు తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేదు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ ఎప్పుడో సమాచారం చక్కర్లు కొడుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి రేసులో బరిలోకి దిగింది. సుమారు మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. వసూళ్లు డ్రాప్ అవుతూనే వచ్చాయి. గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ గురించి బజ్ స్ట్రాంగ్‍గా నడుస్తోంది.
ఓటీటీలోకి అప్పుడేనా!
గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. రిలీజ్‍కు ముందే ఈ ఓటీటీ డీల్ జరిగింది. కాగా, గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి రెండో వారంలో వస్తుందని తాజాగా జబ్ నెలకొంది. ఫిబ్రవరి 14 లేదా 15న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ప్రైమ్ వీడియో ప్లాన్ చేసుకుందనే రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ గురించి ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ కూడా డల్‍గానే ఉంది. మరి ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తుందేమో చూడాలి.
ఇప్పటికే హెచ్‍డీ ప్రింట్ లీక్
గేమ్ ఛేంజర్ సినిమా హెచ్‍డీ ప్రింట్ అప్పటికే ఆన్‍లైన్‍లో లీక్ అయింది. ఈ విషయంలో సైబర్ క్రైమ్‍కు మూవీ టీమ్ ఫిర్యాదు కూడా చేసింది. దీని వెనుక ఓ ముఠా ఉందని, లీక్ గురించి రిలీజ్‍కు ముందే బెదిరింపులు వచ్చాయని కంప్లైట్ చేసింది. రిలీజైన వారంలోనే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ ప్రింట్ లీక్ అవడం కూడా గేమ్ ఛేంజర్ మూవీకి ఎదురుదెబ్బగా మారింది.
కలెక్షన్లు డీలా
గేమ్ ఛేంజర్ చిత్రానికి తొలి రోజు రూ.186కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించడం రచ్చ అయింది. లెక్కలు పెంచేసి చూపిస్తున్నారని నెటిజన్ల నుంచి భారీగా ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఆ తర్వాత వసూళ్లలో డీలా పడింది ఈ చిత్రం. గేమ్ ఛేంజర్ సినిమా మొత్తంగా 12 రోజుల్లో ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు అంచనా. ఇండియాలోనే ఈ చిత్రానికి ఇప్పటి వరకు రూ.130కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా ఈ చిత్రంపై ప్రభావాన్ని చూపింది.
గేమ్ ఛేంజర్ సినిమాను సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍తో దిల్‍రాజు, శిరీష్ నిర్మించినట్టు అంచనా. ఈ మూవీలో రెండు పాత్రల్లో యాక్టింగ్ అదరగొట్టారు రామ్‍చరణ్. అయితే, ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన తీరుపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వానీ, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ కీలకపాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం