Telugu OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ – మ‌తిపోగొట్టే ట్విస్ట్‌ల‌తో…!

Best Web Hosting Provider In India 2024

Telugu OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ – మ‌తిపోగొట్టే ట్విస్ట్‌ల‌తో…!

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2025 11:56 AM IST

Telugu OTT: తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఫియ‌ర్ ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా బుధ‌వారం ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వేదిక హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అర‌వింద్ కృష్ణ‌, ప‌విత్రా లోకేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

తెలుగు ఓటీటీ
తెలుగు ఓటీటీ

Telugu OTT: వేదిక హీరోయిన్‌గా న‌టించిన తెలుగు సైక‌లాజిక‌ల్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఫియ‌ర్ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా బుధ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ తెలుగు మూవీ రిలీజైంది. ఫియ‌ర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోన్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల త‌ర్వాత ఫియ‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది.

yearly horoscope entry point

ప‌లు అవార్డులు…

ఫియ‌ర్ మూవీలో వేదిక‌తో పాటు అర‌వింద్ కృష్ణ‌, ప‌విత్రా లోకేష్, జ‌య‌ప్ర‌కాష్‌, అనీల్ కురువిల్లా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌రిత గోగినేని ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డానికి ముందే ప‌లు ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఫియ‌ర్ మూవీ అవార్డుల‌ను అందుకున్న‌ది.

డిసెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్‌…

డిసెంబ‌ర్ సెకండ్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఫియ‌ర్‌ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. థ్రిల్ల‌ర్ అంశాల‌కు హార‌ర్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్ట‌ర్‌. టీనేజ్ పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో త‌ల్లిదండ్రుల‌ బాధ్య‌త‌ను గుర్తుచేసేలా ఓ చిన్న మెసేజ్‌ను ఈ సినిమాలో ట‌చ్ చేశారు. కానీ కంటెంట్ వీక్ కావ‌డం, స‌రైన ప్ర‌మోష‌న్స్ లేని కార‌ణంగా ఫియ‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌…

ఫియ‌ర్ మూవీకి అనూప్‌ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే హ‌రిత గోగినేని డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైరెక్ష‌న్‌తో పాటు ఈ సినిమాకు ఎడిట‌ర్‌గా కూడా హ‌రిత ప‌నిచేశారు.

ఫియ‌ర్ మూవీ క‌థ ఇదే…

సింధు (వేదిక‌) త‌న క్లాస్‌మేట్ సంప‌త్‌ను (అర‌వింద్ కృష్ణ‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లైన కొద్ది రోజుల‌కే సంప‌త్ క‌నిపించ‌కుండా పోతాడు. భ‌ర్త కోసం అన్వేషిస్తుంటుంది సింధు. త‌న‌ను ఓ అజ్ఞాత వ్య‌క్తి వెంబ‌డిస్తున్నాడ‌న‌ని, చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఎప్పుడు భ‌య‌ప‌డుతుంటుంది.

సింధు ప్ర‌వ‌ర్త‌న మితిమీర‌డంతో ఆమెను మెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేస్తారు కుటుంబ‌స‌భ్యులు. అక్క‌డ సింధుకు ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? సింధు రూపంలోనే ఉన్న ఇందు ఎవ‌రు? సంప‌త్ ఏమ‌య్యాడు? భ‌ర్త‌పై సింధు పెంచుకున్న పిచ్చి ప్రేమ ఎలాంటి అన‌ర్థాల‌కు దారి తీసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ర‌జాకార్ మూవీలో…

తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది వేదిక‌. క‌ళ్యాణ్ రామ్ విజ‌య‌ద‌శ‌మితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వేదిక‌. బాణం, ద‌గ్గ‌ర‌గా దూరంగా, రూల‌ర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. నాగార్జున బంగార్రాజులో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది.

గ‌త ఏడాది తెలుగులో రిలీజైన ర‌జాకార్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలి పాత్ర‌లో క‌నిపించింది. య‌క్షిణి అనే వెబ్‌సిరీస్ చేసింది. ఈ సిరీస్‌తోనే వేదిక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024