ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనం

Best Web Hosting Provider In India 2024

కుల అహంకారంతో ప్రవర్తిస్తే తిర‌గ‌బ‌డుతారు

వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జ‌గ‌న్‌లు ఏనాడు కులం కోసం పని చేయ‌లేదు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం

విజయవాడ : తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు.. కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనుక మిగతా కులాలు తిరగబడతాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం హితవు పలికారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని ఆయ‌న మండిప‌డ్డారు. ఏబీవీ ‘కమ్మ’ వ్యాఖ్యలపై తలశిల రఘురాం మీడియాతో మాట్లాడారు. 

క‌మ్మ కులానికి ఆపాదించ‌డం ఏంటి?
ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అహంకారం తో తలతిక్కగా ప్రవర్తిస్తున్నార‌ని త‌ల‌శిల ర‌ఘురాం ఫైర్ అయ్యారు.  కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలి. ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు. దానికి కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. ఏబీ  వెంకటేశ్వరరావు భాష అభ్యంతకరంగా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైయ‌స్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు చేపట్టారు.  

ఆ ఇద్ద‌రూ కులాల‌కు అతీతంగా పాల‌న‌:
దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు ఏనాడూ కులం కోసం పని చేయ‌లేద‌ని ర‌ఘురాం పేర్కొన్నారు. ఆ ఇద్దరూ కులాలకు అతీతంగా పాలన చేశార‌ని గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. కమ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా?.  ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్‌ స్పందించరేమ‌ని, ఆయ‌న కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావించాల్సి ఉంటుంద‌ని తలశిల ర‌ఘురాం అన్నారు. 

Best Web Hosting Provider In India 2024