Best Web Hosting Provider In India 2024
APSRTC Tour Packages : కుంభమేళతో పాటు కాశీ యాత్రకు స్పెషల్ బస్సులు – తాజా టూర్ ప్యాకేజీలివే
ఏపీఎస్ ఆర్టీసీ నుంచి మరో రెండు కొత్త టూర్ ప్యాకేజీలు వచ్చాయి. రాజమండ్రి నుంచి మహా కుంభమేళాకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఇదే కాకుండా… మహా శివరాత్రికి కూడా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు టూర్ షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది.
మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాజమండ్రి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళాకి, అలాగే మహా శివరాత్రి వేళ కాశీ యాత్రకు స్పెషల్ బస్ సర్వీస్‌లను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఓ ప్రకటనలో కోరింది.
ప్యాకేజీ ఇలా…
- రాజమండ్రి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ ‘టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
- ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి బస్ కాంప్లెక్స్‌లో బస్ బయలుదేరుతుంది.
- అన్నవరం, సింహాచలం, పూరి, కోణార్క్ మీదుగా గయా, వారణాసి, ప్రయాగరాజ్-మహా కుంభమేళాకు యాత్ర ఉంటుంది.
- త్రివేణి సంఘమ స్నానం, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ దేవిల దర్శన అవకాశం ఉటుంది.
- బ్యాచ్‌లు వారీగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి రీజనల్ మేనేజర్ కె.షర్మిల అశోక తెలిపారు. ఫిబ్రవరి 26 వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయని అన్నారు.
మహా శివరాత్రికి టూర్ ప్యాకేజీ…
- మహాశివరాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీవిశ్వేశ్వరుని దర్శనం కోసం మరో టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.
- ఫిబ్రవరి 11న రాజమండ్రి డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- ఈ యాత్ర 11 రోజులు ఉంటుంది. 13 క్షేత్రాల మీదుగా యాత్ర సాగుతోంది.
- రాజమండ్రిలో బస్సు బయలుదేరి భువనేశ్వర్, పూరి, కోణార్క్, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోద్య, సీతామర్ఫీ, నైమిశారణ్యం, గయ, బుద్ధగయ, అరసవెల్లి, అన్నవరం మీదుగా రాజమండ్రి చేసుకుంటాయి.
- ఈ యాత్రీకులకు కూడా కుంభమేళాలో త్రివేణి సంగమ స్నాన సదుపాయాన్ని కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి రీజనల్ మేనేజర్ కె.షర్మిల అశోక తెలిపారు.
సాంకేతకతను ఉపయోగించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. what3wards///App సహాయంతో ప్రయాణీకులందరూ ఎక్కడ ఉన్నా బస్సు వద్దకు చేరుకోవచ్చు. ఈ యాప్‌ను బస్సు బయలుదేరేనప్పుడు ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యాప్ వల్ల ప్రయాణికులు చాలా ప్రయోజనం కలుగుతోంది. బస్సు ఎక్కడుందో అందులో స్పష్టం అవుతుంది. భక్తులు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సాంకేతికతను తీసుకొచ్చినట్లు ఆర్టీసీ చెబుతోంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్