Best Web Hosting Provider In India 2024
Action OTT: సంక్రాంతికి రిలీజైన బాలకృష్ణ యాక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా? – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
Action OTT: బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఇప్పటికే కొన్ని ఏరియాల్లో లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. కాగా డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తి వార్త ప్రచారం అవుతోంది.
Action OTT: బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 160 కోట్ల వరకు గ్రాస్ , 75 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ నైజాం ఏరియాలో వసూళ్లు తక్కువగా ఉండటం, సంక్రాంతికి వస్తున్నాం పోటీ కారణంగా సెకండ్ వీక్‌లో ఈ మూవీ జోరు కాస్త తగ్గింది.
ప్రాఫిట్ జోన్‌లోకి…
బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల టార్గెట్‌తో డాకు మహారాజ్ మూవీ రిలీజైంది. బ్రేక్ ఈవెన్‌కు మరో ఐదు కోట్ల దూరంలో ఈ మూవీ నిలిచింది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఈ మూవీ ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటరైనట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్‌లో…
డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మాస్ యాక్షన్ మూవీ డిజిటల్ రైట్స్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. బాలకృష్ణ మూవీ ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9న రిలీజయ్యే అవకాశం ఉందని చెబుతోన్నారు. డాకు మహారాజ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్…
డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. చాందని చౌదరి, సచిన్ ఖేడ్కర్, రవి కిషన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించాడు.
ఈ సినిమాలో డాకు మహారాజ్, నానాజీ, సీతారం అనే మూడు వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో బాలకృష్ణ కనిపించాడు. బాలకృష్ణ యాక్టింగ్, ఆయన ఎలివేషన్లతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
డాకు మహారాజ్ కథ ఇదే…
చంబల్ ఏరియా మొత్తాన్ని మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ ( బాబీ డియోల్) శాసిస్తుంటాడు. బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తుంటారు. చంబల్ ప్రాంతంలోకి సీతారాం (బాలకృష్ణ) అతడి భార్య (ప్రగ్యా జైస్వాల్) ఇరిగేషన్ ఇంజినీర్లుగా వస్తారు. బల్వంత్ అక్రమాలను సీతారం ఏం చేశాడు.
బల్వంత్ బారి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడటానికి వచ్చిన డాకు మహారాజ్ (బాలకృష్ణ) ఎవరు? అతడికి సీతారామ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? మదనపల్లిలో ఉన్న ఓ చిన్నారి వైష్ణవిని వెతుక్కుంటూ డాకు మహారాజ్ ఎందుకొచ్చాడు? వైష్ణవిని ఎమ్మెల్యే త్రిమూర్తులు చంపాలని ఎందుకు అనుకున్నాడు? డాకు మహారాజ్ జీవితంలోకి వచ్చిన నందిని ఎవరు అనే అంశాలతో డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ సినిమాను రూపొందించాడు.